తెలుగు న్యూస్  /  National International  /  Nine-year-old Boy Accused Of Sexual Assault

Crime | నాలుగున్నరేళ్ల చిన్నారిపై తొమ్మిదేళ్ల బాలుడు లైంగిక దాడి..

HT Telugu Desk HT Telugu

17 April 2022, 19:03 IST

  • మహారాష్ట్ర: తొమ్మిదేళ్ల బాలుడు.. నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఠాణెలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

చిన్నారిపై బాలుడు లైంగిక దాడి
చిన్నారిపై బాలుడు లైంగిక దాడి (Hindustan times telugu)

చిన్నారిపై బాలుడు లైంగిక దాడి

మహారాష్ట్ర ఠాణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు.. నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు!

ట్రెండింగ్ వార్తలు

Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

ఎవరు లేని చోటకు తీసుకెళ్లి..

ఉల్హస్​నగర్​ పట్టణంలో ఈ నెల 3న జరిగింది ఈ ఘటన. చిన్నారిని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ బాలుడు. అక్కడే ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత.. నొప్పులు రావడంతో ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కానీ ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్​ చేయలేదు.

టిఫిన్​లో ఉప్పు ఎక్కువైందని…

మహారాష్ట్రలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఠాణెలో నేరాల సంఖ్య అధికంగా ఉంది. టిఫిన్​లో ఉప్పు ఎక్కువైందని చెప్పి.. 40ఏళ్ల భార్యను కడతేర్చాడు ఓ కిరాతక భర్త.

ఠాణెలోని భయందర్​ టౌన్​షిప్​లో శుక్రవారం ఉదయం జరిగింది ఈ ఘటన. ఎప్పటిలాగే.. భర్తకు టిఫిన్​ పెట్టింది ఆ మహిళ. అది తిన్న వెంటనే అతడికి ఎక్కడలేనంత కోపం వచ్చేసింది.

"నిందితుడి పేరు నిలేష్​ గాఘ్​(46). శుక్రవారం ఉదయం టిఫిన్​ చేశాడు. సుమారు 9:30 గంటల సమయంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్య చేసిన కిచిడిలో ఉప్పు ఎక్కువైందనేది కారణం," అని అధికారులు వెల్లడించారు. ఓ పొడవాటి గుడ్డ సాయంతో అతను సొంత భార్య గొంతు నులిమి హత్య చేశాడని వివరించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి పరుగులు తీశారు. మహిళ మృతదేహాన్ని ఫోరెన్సిక్​ టెస్టుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

టాపిక్