తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crime News | కుటుంబాన్ని వదిలి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో వెళ్లింది.. చివరకు భర్తే..

Crime News | కుటుంబాన్ని వదిలి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో వెళ్లింది.. చివరకు భర్తే..

HT Telugu Desk HT Telugu

17 April 2022, 9:20 IST

    • భర్తను వదిలి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో వెళ్లింది. ఇద్దరు పిల్లలున్నా.. అతడు చెప్పిన మాటలు నమ్మింది. అయితే అతడి ఇంటికి వెళ్లాక.. అసలు నిజాలు తెలిసి షాక్ అయింది. చివరకు మళ్లీ భర్తే సాయం చేయాల్సి వచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

సికింద్రాబాద్‌లో ఉంటున్న మహిళ(40) ఇరవై ఏళ్లక్రితం పెళ్లి చేసుకుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య.. వివాదాలు నడుస్తున్నాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొమ్మిది నెలలుగా ఇద్దరూ వీడిగా ఉంటున్నారు. ఏదో ఒక బిజినెస్ చేయాలని మహిళ నిర్ణయించుకుంది. ఇందలో భాగంగా సోషల్ మీడియాను వాడుతోంది. అందులో ఎవరైనా.. సాయం చేస్తారా అని ఎదురుచూసింది. బిజినెస్ పెట్టేందుకు తన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారనుకుని.. ఫేస్ బుక్ లో పరిచయాలు పెంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ACB Raids On ACP : ఏసీపీ ఇంట్లో 12 గంటలుగా ఏసీబీ సోదాలు- రూ.45 లక్షల నగదు, 65 తులాల బంగారం స్వాధీనం!

Jagtial Crime : మెట్ పల్లిలో మహిళ దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

TS Universities VCs : తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం, కేయూలో ఫైళ్ల మాయం కలకలం!

NGT On Manair Sand Mining : మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా జరిమానా!

పంజాబ్ లోని లుథియానాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే.. అతడు.. తన గురించి మహిళ దగ్గర గొప్పలు చెప్పుకున్నాడు. తను వెల్ సెటిల్డ్ అని.. తనకున్న బిజినెస్ ద్వారా నెలకు 2 లక్షల వరకూ వస్తాయని చెప్పాడు. ఇదంతా నిజమేనని మహిళ నమ్మింది. రెండు నెలల క్రితం అతడు హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరూ కలిసి చాలా ప్రాంతాలు తిరిగారు. తన అకౌంట్ పనిచేయడం లేదని.., లక్ష రూపాయలు కావాలని అడిగాడు. సరేనని రూ.60 వేలు ఇచ్చింది. అతడితో కలిసి పంజాబ్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక అసలు విషయాలు తెలిసి మహిళ షాక్ అయింది.

అతడు మాటలతో మాయచేశాడని గుర్తించింది. ఏ పనిచేయకుండా పదవీవిరమణ అయిన తన తండ్రి పింఛన్‌తో జీవిస్తున్నాడని తెలుసుకుంది. వారుంటున్న ఇల్లు కూడా చిన్నగా ఉంది. ఈ విషయాన్ని అతడి తండ్రిని అడిగింది. ఓ హత్య కేసులో తన కుమారుడు ముద్దాయి అని.. చాలా రోజులు జైల్లోనే ఉన్నాడని ఆయన తెలిపారు. ఈ సమయంలోనే.. ఫేస్ బుక్ స్నేహితుడు వచ్చాడు. ఈ క్రమంలో ఎందుకు మోసం చేశావని మహిళ నిలదీసింది. అయితే అతడి తండ్రి జోక్యం చేసుకుని.. న్యాయం చేస్తానని హైదరాబాద్ పంపించాడు.

ఆమె హైదరాబాద్ రాగానే.. నగ్నచిత్రాలు, మార్ఫింగ్ వీడియోలు.. ఆమె ఫోన్ కు పంపించేవాడు. తెలిసిన వాళ్లందరికీ పంపుతానని బెదిరించాడు. మహిళ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తెలిసిన కొంతమంది స్నేహితులకు వీడియోలు పంపించాడు. ఏం కావాలని మహిళ ప్రశ్నించగా.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అసలు కుదరదని మహిళ చెప్పింది. వీడియోలు.. యూట్యూబ్ లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయం మహిళ భర్తకు తెలిసింది. ఆమెకు ధైర్యం చెప్పి.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.

టాపిక్

తదుపరి వ్యాసం