తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Covid News | ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

Mumbai covid news | ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

HT Telugu Desk HT Telugu

01 February 2022, 19:57 IST

    • Mumbai covid news today | ఒమిక్రాన్​ వ్యాప్తి తగ్గుతున్న వేళ ముంబయి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.
ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత (hindustan times)

ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

Mumbai covid restrictions today | కరోనా వ్యాప్తి, కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ముంబయిలో రాత్రి కర్ఫ్యూను అధికారులు ఎత్తివేశారు. రెస్టారెంట్లు, థియేటర్లపై ఉన్న ఆంక్షలను కొంతమేరకు సడలించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

"హోటళ్లు, థియేటర్లు.. 50శాతం సామర్థ్యంతో పని చేసుకోవచ్చు. స్థానిక పర్యాటక ప్రాంతాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. క్రీడలు, ఇతర కార్యకలాపాలకు 25శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. పెళ్లిళ్లలోనూ ఇదే వర్తిస్తుంది," అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ముంబయిలో తాజాగా 803 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 14,372 కేసులు వెలుగులోకి వచ్చాయి.

కొవిడ్​ కారణంగా దేశంలో అత్యంత ప్రభావితమైన రాష్ట్ర మహారాష్ట్ర. కేసులు, మరణాలు అత్యధికంగా ఇక్కడే నమోదయ్యాయి. కొవిడ్​ నుంచి కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​.. రాష్ట్రంపై పంజా విసిరింది. ఫలితంగా అధికారులు మరోమారు కఠిన ఆంక్షలు విధించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతున్న వేళ ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్నారు.