తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Highest Temperatures : ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు షురూ.. 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు!

Highest temperatures : ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు షురూ.. 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు!

Sharath Chitturi HT Telugu

18 February 2023, 9:16 IST

  • Highest temperatures in February : దేశంలో ఫిబ్రవరి నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మార్చ్​ నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు షురూ..
ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు షురూ..

ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు షురూ..

Highest temperatures in February : దేశవ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చ్​ నెల రాకముందే.. భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. దేశంలో వేసవి కాలం ఫిబ్రవరిలోనే మొదలైందా? అన్న విధంగా పరిస్థితులు నెలకొన్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో!

సాధారణంగా ఇండియాలో ఫిబ్రవరి నెల చల్లగానే ఉంటుంది. వేసవి కాలం మార్చ్​ మధ్య వారంలో మొదలవుతుంది. మే, జూన్​ వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. కానీ ఈసారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఫిబ్రవరి మధ్య వారంలోనే పగటి పూట ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి!

Temperature in Hyderabad today : ఈ అంశంపై భారత వాతావరణశాఖ డేటాను హిందుస్థాన్​ టైమ్స్​ ఎనలైజ్​​ చేసింది. దేశంలో వేసవి కాలం ముందే మొదలయ్యే సూచనలను గుర్తించింది. ఇదే జరిగితే.. గోధుమ పంట ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టమైంది.

పంజాబ్​తో పాటు 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్​ అవుతున్నాయి. సాధారణంగా ఈ స్థాయి ఉష్ణోగ్రతలు మార్చ్​ మధ్య వారంలో నమోదవుతాయి. ఇక ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​తో పాటు మొత్తం మీద 10 రాష్ట్రాల్లో.. మార్చ్​ తొలి వారంలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈ నెల మధ్యలోనే రికార్డ్​ అవుతుండటం ఆందోళనకర విషయం.

అధిక ఉష్ణోగ్రతలకు కారణం ఇదే..!

Telangana highest temperatures : సాధారణంగా శీతాకాలంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఈ ఏడాది అలా జరగలేదు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నుంచే పెరగడం మొదలుపెట్టాయి. రానున్న రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే నిజమైతే.. గోధుమ పంటపై భారీ ప్రభావమే పడుతుంది.

దేశంలో ఫిబ్రవరి 16తో ముగిసిన వారంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రత 27.52 డిగ్రీలుగా నమోదైంది. 1981-2010 సగటుత పోల్చుకుంటే ఇది 0.39 డిగ్రీలు ఎక్కువ. దీనిని సాధారణంగానే పరిగణిస్తోంది ఐఎండీ. గతేడాది ఇదే కాలంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలుగా ఉంది.

Highest temperatures in India : అయితే.. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలు.. ఈ సగటు అత్యధిక ఉష్ణోగ్రతల్లో కనిపించవు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఫిబ్రవరి 16 నాటికి భానుడి ప్రతాపం తీవ్రస్థాయికి చేరింది. ఆయా ప్రాంతాల్లో 1951 నుంచి ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇది మొదటి, రెండు, మూడో సారి.

India Summer season : అధిక ఉష్ణోగ్రతల పరంగా.. రాజస్థాన్​, గుజరాత్​, ఛత్తీస్​గఢ్​, కర్ణాటక, కేరళ, ఒడిశా, మిజోరాం ప్రాంతాలు టాప్​ 10లో ఉన్నాయి. 1951 నుంచి చూసుకుంటే.. పంజాబ్​, ఢిల్లీ, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, ఝార్ఖండ్​, తమిళనాడులో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.