IMD rain alert : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అలర్ట్!
IMD rain alert : ఉత్తర భారతంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.
IMD rain alert : వాయువ్య భారతంతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బాల్టిస్థాన్, ముజాఫర్బాద్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, తూర్పు మధ్య ప్రదేశ్తో పాటు తమిళనాడులో మంగళవారం నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో మంచు కూడా కురుసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వర్షాలు.. మంచు.. పొగమంచు..!
రానున్న కొన్ని రోజుల్లో.. తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్, బిహార్లలో రానున్న 24 గంటలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో మరో 48 గంటల్లో రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంటుంది.
Heavy rains in Uttar Pradesh : అయితే.. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, బిహార్, తూర్పు రాజస్థాన్, వాయువ్య మధ్యప్రదేశ్లో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల మధ్యలో ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు- మంచు..!
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో సోమవారం వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. మంగళవారం నుంచి ఈ నెల 26వరకు కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వానలు పడతాయి. 24, 25న జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బాల్టిస్థాన్, ముజాఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షపాతం/ హిమపాతం నమోదవుతుంది. 25, 26వ తేదీల్లో ఉత్తరాఖండ్లో వర్షాలు పడతాయి.
IMD weather update : పంజాబ్, హరియాణా, చంఢీగఢ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్లలో సోమవారం మోస్తారు వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ప్రాంతాల్లో 24 నుంచి 26 వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.
ఉత్తర రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో.. ఈ నెల 24 నుంచి 26 వరకు ఉరుములతో కూడిన వర్షం, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షపాతం నమోదవుతుంది.
సంబంధిత కథనం