Rain Alert : ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
TN Rain Alert : తమిళనాడు ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్! సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురవనున్నాయి.
TN Rain Alert : తమిళనాడులో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ(ఐఎండీ)కి చెందిన ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
ఐఎండీ తమిళనాడు ప్రకారం.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. తుత్తుకుడి, రామనాథపురం, పుడుక్కోటై, శివగంగ, థంజావూర్, తిరువారూర్, నాగపట్టినం, మయిలదుథురై, కుద్దులూరు జిల్లాల్లో.. ఈ నెల 21న భారీ వర్షాలు కురుస్తాయి.
ఈ ప్రాంతల ప్రజలకు అలర్ట్..
Heavy rain Tamil Nadu : మరోవైపు.. దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో ఈ నెల 20,21 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌కు చెందిన రామనాథపూం, తిరువారూర్, నాగపట్టినం, శివగంగ, పుదుక్కొటై, థంజావూర్, మయిలదుథురై, కుద్దులూరు, విల్లూపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 22న భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజుల్లో తమిళనాడులో ఆకాశం మేఘావృత్తం అయి ఉంటుందని ఐఎండీ వివరించింది.
"కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. 30-25 డిగ్రీల మధ్యలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది," అని ఐఎండీ పేర్కొంది.
మాండుస్ తుపాను ఎఫెక్ట్..
Tami Nadu rain alert : మాండూస్ తుపాను నేపథ్యంలో గత వారం కూడా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. తుపాను కారణంగా విద్యా సంస్థలు కొన్ని రోజుల పాటు మూతపడే ఉన్నాయి.
తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా లక్ష ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
IMD Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీకి వర్ష సూచన!
December 15 2022
IMD Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన!
December 03 2022
Heavy Rains Alert : బంగాళాఖాతంలో వాయుగుండం… కోస్తాలో భారీ వర్షాలు…
November 21 2022
Chennai rains : దంచికొడుతున్న వర్షాలు.. చెన్నై ఉక్కిరిబిక్కిరి!
November 01 2022