Mandous Cyclone Effect : మాండూస్ ఎఫెక్ట్.. లక్ష ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంట-mandous cyclone effect heavy crop damage in andhra pradesh
Telugu News  /  Andhra Pradesh  /  Mandous Cyclone Effect Heavy Crop Damage In Andhra Pradesh
మాండూస్ తుపాను ఎఫెక్ట్
మాండూస్ తుపాను ఎఫెక్ట్

Mandous Cyclone Effect : మాండూస్ ఎఫెక్ట్.. లక్ష ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంట

12 December 2022, 6:31 ISTHT Telugu Desk
12 December 2022, 6:31 IST

Mandous Cyclone Effect In AP : మాండూస్ తుపాను రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంటలపై తీవ్ర ప్రభావం చూపించింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కురిశాయి.

మాండూస్ తుపాను(Mandous Cyclone) అన్నదాతలను భారీగా ముంచింది. రాష్ట్రవాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నది. తమ పొలాల్లోని పంట చూసి అన్నదాతలు కంటనీరుపెడుతున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల్లో అధికారులు ఉన్నారు. బాపట్ల జిల్లా కృష్ణా డెల్లా పరిధిలో రేపల్లె, బాపట్ల వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వర్షాలకు ముందు కోసి ఆరబెట్టిన సుమారు 30 వేల ఎకరాల్లో వరి కంకులు నీట మునిగాయి.

మరో 40 వేల ఎకరాల్లో వరి వర్షానికి నేలకు ఒరిగింది. ఇక వాణిజ్య, ఉద్యాన పంటలు భారీగానే దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరిధాన్యం పొలాల్లోనే ఉండటంతో.. వర్షపు నీటికి తడిచి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతంలో మిర్చి(Mirchi) పంటకు నష్టం భారీగా అయింది.

నెల్లూరు(Nellore), తిరుపతి(Tirupati) జిల్లాల్లో ఇటీవల నాట్లు వేసిన వరి కూడా నీట మునిగింది. నెల్లూరుతోపాటుగా తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నది. కోత కోసి ఆరబెట్టిన ధాన్యం(Paddy)తోసైతం రైతులు నష్టపోయారు. గుంటూరు, బాపట్ల, ప్రకారం, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ తదితర జిల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసింది.

ఇక కడప(Kadapa) జిల్లాలో 35 మండలాల్లో, అన్నమయ్య జిల్లాల్లోలోని ఏడు మండలాల్లో 9,001 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కడప జిల్లాలోని మండలాల్లో సుమారు 30 రకాల పంటలపై తుపాను ప్రభావం పడింది. 4,387 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 2,062 ఎకరాల్లో బుడ్డశనగ, 1,042 ఎకరాల్లో వరి, 1,235 ఎకరాల్లో జోన్న పంటలు నేలకొరిగాయి. 141.5 ఎకరాల్లో పండ్ల తోటలపై ప్రభావం కనిపించింది. అరటి, ఉల్లి, టమోట పంటలకు నష్టమైంది.

పెట్టుబడి, శ్రమించిన కష్టం ఇక నీటి పాలైనట్టేనని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలతో(Heavy Rains) మినుము, టమటా, వేరు శెనక పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో వేసిన పొగాకు నాట్లతోనూ రైతులు నష్టపోయారు. ప్రకాశం(Prakasham) జిల్లాలో మిర్చి, పొగాకు, శనగ, కొత్తిమీర, కుసుమ, మినుము తదితర పంటలు సాగు చేశారు. శనివారం సాయంత్రం వరకు మంచి ఫలితాలు వస్తాయని అనుకున్నారు. కానీ వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఏ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు.