తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  2 గంటల్లో 8సార్లు కాల్స్​.. అంబానీ కుటుంబానికి బెదిరింపులు.!

2 గంటల్లో 8సార్లు కాల్స్​.. అంబానీ కుటుంబానికి బెదిరింపులు.!

Sharath Chitturi HT Telugu

15 August 2022, 18:57 IST

  • Death threat to Mukesh Ambani : ముకేశ్​ అంబానీ కుటుంబానికి తాజాగా బెదిరింపులు వచ్చాయి. 2 గంటల్లో 8సార్లు కాల్స్​ చేసి మరీ నిందితుడు బెదిరించాడు.

అంబానీ కుటుంబానికి బెదిరింపులు.!
అంబానీ కుటుంబానికి బెదిరింపులు.! (PTI)

అంబానీ కుటుంబానికి బెదిరింపులు.!

Death threat to Mukesh Ambani : భారత దేశ దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ కుటుంబానికి మరోమారు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి.. ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 2 గంటల్లో 8సార్లు కాల్స్​ చేసి.. ముకేష్​ అంబానీని ఆ వ్యక్తి బెదిరించినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

దక్షిణ ముంబైలో జ్యువెలరీ వ్యాపారిగా ఉన్న విష్ణు భౌమిక్​.. తన పేరును అఫ్జల్​గా మార్చుకుని.. రిలయన్స్​కు చెందిన హర్షిసందాస్​ ఆసుపత్రికి సోమవారం 8సార్లు కాల్స్​ చేశాడు.

56ఏళ్ల భౌమిక్​.. బెదిరింపులకు పాల్పడిన సమయంలో ధీరూభాయ్​ అంబానీ పేరును కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

దాహిసార్​ ప్రాంతానికి చెందిన భౌమిక్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతనిపై ఐపీసీ 506(2) కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై పలు కేంద్ర సంస్థలు సైతం స్థానిక అధికారుల నుంచి వివరణ కోరినట్టు తెలుస్తోంది.

"నిందితుడు ముకేశ్​ అంబానీని హత్య చేస్తానని బెదిరించాడు. దుర్భాషలాడాడు. అతడిని అరెస్ట్​ చేశాము," అని డీసీపీ నిలోట్​పల్​ ఇండియా టుడేకు చెప్పారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ముకేశ్​ అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. గత ఫిబ్రవరిలోనే.. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని ముకేశ్​ అంబానీ నివాసం 'అంటిల'కు అత్యంత సమీపంలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో పోలీసు అధికారులు ఉండటం గమనార్హం.