తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రిలయన్స్ జియో పగ్గాలు ఆకాశ్ అంబానీకి.. రాజీనామా చేసిన ముకేశ్ అంబానీ

రిలయన్స్ జియో పగ్గాలు ఆకాశ్ అంబానీకి.. రాజీనామా చేసిన ముకేశ్ అంబానీ

HT Telugu Desk HT Telugu

28 June 2022, 17:21 IST

google News
    • రిలయన్స్ జియో పగ్గాలను కొడుకు ఆకాశ్ అంబానీకి అప్పగించి ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు.
పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో ముకేష్ అంబానీ (ఫైల్ ఫోటో)
పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో ముకేష్ అంబానీ (ఫైల్ ఫోటో) (PTI)

పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో ముకేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

న్యూఢిల్లీ, జూన్ 28: ముకేశ్ అంబానీ తన గ్రూప్ టెలికాం విభాగం రిలయన్స్ జియో బోర్డుకు రాజీనామా చేశారు. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి కంపెనీ పగ్గాలను అప్పగించారు. ఇది 65 ఏళ్ల బిలియనీర్ వారసత్వ ప్రణాళికగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘కంపెనీ బోర్డు డైరెక్టర్ల ఛైర్మన్‌గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ నియామకాన్ని జూన్ 27న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదించింది..’ అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది.

ముకేశ్ అంబానీ రాజీనామా జూన్ 27 సాయంత్రం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తాజా నియామకం అమల్లోకి వస్తుంది.

కాగా ఐదు సంవత్సరాల పాటు కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియమితులయ్యారు. రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించారు.

తదుపరి వ్యాసం