తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Laptop Causes Fire In Flight: ల్యాప్‍టాప్‍ వల్ల విమానంలో చెలరేగిన మంటలు

Laptop Causes fire in Flight: ల్యాప్‍టాప్‍ వల్ల విమానంలో చెలరేగిన మంటలు

08 February 2023, 16:02 IST

    • Laptop Causes fire in Flight: ల్యాప్‍టాప్ వల్ల టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ఫ్లైట్‍ క్యాబిన్‍లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే తిరిగి అదే ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లింది ఆ విమానం.
Laptop Causes fire in Flight: ల్యాప్‍టాప్‍ వల్ల విమానంలో చెలరేగిన మంటలు
Laptop Causes fire in Flight: ల్యాప్‍టాప్‍ వల్ల విమానంలో చెలరేగిన మంటలు (AP)

Laptop Causes fire in Flight: ల్యాప్‍టాప్‍ వల్ల విమానంలో చెలరేగిన మంటలు

Laptop Causes fire in Flight: ల్యాప్‍టాప్ కారణంగా ఓ విమానం క్యాబిన్‍లో మంటలు రేగాయి. దీంతో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానంలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం జరగటంతో నెవార్క్ (Newark) కు వెళ్లాల్సిన విమానాన్ని వెంటనే మళ్లీ సాన్ డిగో(San Diego)లో ల్యాండ్ చేశారు. ఈ ఘటన మంగళవారం జరిగిందని సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

ఇదీ జరిగింది

Laptop Causes fire in Flight: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2664 టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు వచ్చాయని ఆ విమానయాన సంస్థ ప్రతినిధి చార్లెస్ హోబార్ట్.. యూఎస్ఏ టుడేతో చెప్పారు. “ఉదయం 7.30 గంటల సమయంలో ఓ కస్టమర్‌కు చెందిన బ్యాటరీ ప్యాక్ (ల్యాప్‍టాప్‍లోనిది) నుంచి మంటలు వచ్చాక.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2664 సురక్షితంగా మళ్లీ సాన్ డిగో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది” అని ఆయన చెప్పారు. సిబ్బంది త్వరగా స్పందించి ఆ డివైజ్‍ను గుర్తించారని, ఈ అగ్నిప్రమాదం వల్ల ప్రభావితమైన వారిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ల్యాప్‍టాప్ బ్యాటరీ నుంచి మంటలు రావటంతో ఈ ఘటన జరిగింది.

ముప్పు తప్పింది

“ముందుజాగ్రత్తగా కొందరు విమాన సిబ్బందిని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇద్దరు ప్రయాణికులకు ఇక్కడే అత్యవసర చికిత్స అందించాం” అని హోబార్ట్ చెప్పారు. తమ సిబ్బంది త్వరగా స్పందించటంతో ముప్పు తప్పిందని అన్నారు. వారి గమ్యస్థానాలకు కస్టమర్లను చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Laptop Causes fire in Flight: ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ విషయంపై స్పందించింది. ల్యాప్‍టాప్ బ్యాటరీ ద్వారా మంటలు చెలరేగాయని, ఈ విషయంపై విచారణ జరుపుతామని ఎఫ్ఏఏ ప్రతినిధి ఇయాన్ గ్రెగోర్ తెలిపారు.

కాగా, సౌదీ అరేబియా నుంచి భారత్ వస్తున్న ఓ విమానం మంగళవారం జోధ్‍పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఓ మహిళా ప్రయాణికురాలు విమానం టేకాఫ్ అయ్యాక గుండె పోటుకు గురవటంతో ఆసుపత్రికి తరలించేందుకు అక్కడ ల్యాండ్ చేశారు సిబ్బంది. అయితే ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆమె మృతి చెందారు.