తెలుగు న్యూస్  /  National International  /  Flight Takes Off Without Taking 35 Passengers At Amritsar Airport

Scoot Flight: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం.. పదిరోజుల్లో రెండోసారి ఇలా..

19 January 2023, 12:57 IST

    • Flight Takes off without taking passengers: ప్రయాణికులను ఎక్కించుకుండా బయలుదేరాల్సిన సమయం కంటే ముందుగానే ఓ విమానం వెళ్లిపోయింది. దీంతో ఎయిర్ పోర్టులో ఆందోళన చేశారు ఆ 35 మంది ప్యాసింజర్లు. ఏం జరిగిందంటే..
Flight: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం
Flight: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం

Flight: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం

Flight Takes off without taking passengers: బెంగళూరు ఎయిర్‌పోర్టులో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా గోఫస్ట్ విమానం ఎగిరిపోయిన ఘటన జరిగి పది రోజులు గడవకుండానే.. మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయింది. అమృత్‍సర్ ఎయిర్‌పోర్టు (Amritsar Airport)లో ఓ విమానం ప్రయాణికులను ఎక్కించుకుండానే వెళ్లిపోయింది. సింగపూర్‌కు బయలుదేరాల్సిన సమయం కంటే ముందుగా ఎగిరిపోయింది. 35 మంది ప్రయాణికులను వదిలేసి బయలుదేరింది. బుధవారం (జనవరి 18) ఈ ఘటన జరిగింది. దీంతో అమృత్‍సర్ విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

ఐదు గంటలు ముందుగా..

Flight Takes off without taking passengers: సింగపూర్‌కు చెందిన స్కాట్ ఎయిర్‌లైన్స్ (Scoot Airlines) విమానం బుధవారం ఇలా 35 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే బయలుదేరి వెళ్లిపోయింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.55 గంటలకు ఈ విమానం వెళ్లాల్సింది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే పయనమైంది. దీంతో ఆ 35 మంది ప్రయాణికులు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. విమానాశ్రయంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం లేకనే..!

Scoot Airlines Flight Incident: ఈ ఘటన వివరాలను ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వీకే సేత్ వెల్లడించారు. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న ఏజెంట్లు.. విమానం సమయం మార్పు గురించి వారికి సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. అయితే విమానం మిస్ అయిన ప్రయాణికులందరికీ మళ్లీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్కాట్ ఎయిర్‌లైన్స్ చెప్పిందని ఆయన వెల్లడించారు.

“280 మంది సింగపూర్‌కు వెళ్లాల్సింది ఉంది. అయితే 253 మందిని మాత్రమే తీసుకెళ్లిన విమానం.. 30 మందికి పైగా వదిలేసింది” అని అమృత్‍సర్ ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు చెప్పారు.

అయితే, విమాన సమయంలో మార్పు గురించి ప్రయాణికులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చామని స్కాట్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది.

విచారణకు ఆదేశించిన డీజీసీఏ

Flight Takes off without taking passengers: సింగపూర్‌కు వెళ్లాలిన స్కాట్ ఎయిర్‌లైన్స్ విమానం.. నిర్ణీత సమయం కంటే ముందుగా బయలు దేరి, 35 మంది ప్రయాణికులను వదిలి వెళ్లిన ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది.

బెంగళూరులో..

బెంగళూరు ఎయిర్‌పోర్టులోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీకి వెళ్లాల్సిన గోఫస్ట్ విమానం (GoFirst Flight) 55 మందిని ఎక్కించుకోకుండానే ఎగిరిపోయింది. విమానంలో ఎక్కేందుకు షటిల్ బస్సులో ప్రయాణికులు వస్తుండగానే.. అది బయలుదేరి వెళ్లిపోయింది. అయితే నాలుగు గంటల తర్వాత ఆ ప్రయాణికులను వేరే విమానంలో పంపించారని సమచారం.

ఈ విషయంపై ఢిల్లీకి చెందిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.