Go First flight : ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం!-go first plane takes off without taking many passengers at bengaluru airport dgca seeks report from airline ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Go First Flight : ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం!

Go First flight : ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 10, 2023 01:28 PM IST

Go First flight : ప్రయాణికులను ఎక్కించుకోకుండా.. ఓ విమానం వెళ్లిపోయిన ఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సంబంధిత విమానం.. గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​కు చెందినది. 55మంది ప్రయాణికులు.. ఈ ఘటనతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం!
ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం!

Go First flight forgets passengers : గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం.. 50మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే టేకాఫ్​ అయ్యింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఏవియేషన్​ రెగ్యులేటర్​ డీజీసీఏ.. గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​ను ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..

గో ఫస్ట్​కు చెందిన ఫ్లైట్​ జీ8 116.. బెంగళూరు కెంపగౌడ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి టేకాఫ్​ అయ్యింది. కాగా.. అంతకుముందు ప్రయాణికులను నాలుగు బస్సుల్లో విమానం వద్దకు తీసుకెళ్లారు. విమానం వెళ్లిపోయినప్పటికీ.. ఓ బస్సులో ప్రయాణికులు ఉండిపోయారు. ఆ బస్సులో మొత్తం 55మంది ఉన్నట్టు తెలుస్తోంది.

Go First flight G8 116 : ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు.. గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​పై ట్విట్టర్​ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "మా వద్ద బోర్డింగ్​ పాస్​లు ఉన్నాయి. మా లగేజ్​ని కూడా చెక్​ చేశారు. అయినా మేము విమానం ఎక్కలేదు. అది వెళ్లిపోయింది," అంటూ.. ఓ ప్రయాణికుడు.. సివిల్​ ఏవియేషన్​ మినిస్టర్​ జ్యోతిరాదిత్య సింథియా, ప్రధాని మోదీ కార్యాలయానికి సంబంధించిన ట్విట్టర్​ ఖాతాలను ట్యాగ్​ చేశాడు.

"చాలా దారుణమైన అనుభవం. ఉదయం 5:35 గంటలకు బస్సు ఎక్కాము. 50 మందిని ఒకే బస్సులో ఎక్కించారు. ఓ గేట్​ దగ్గర ఆపేశారు. 6:30కి మేము లేకుండానే విమానం వెళ్లిపోయింది," అని ఓ మహిళ ట్వీట్​ చేసింది.

Go First flight latest news : "విమానం టేకాఫ్​ అయ్యిందో లేదో అని గ్రౌండ్​ స్టాఫ్​ చెక్​ చేస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత.. విమానం తిరిగొస్తుందని చెబుతూ వచ్చారు. కానీ రాలేదు. నేను నా మీటింగ్​ మిస్​ అయ్యాను. గో ఫస్ట్​ విమానాన్ని నేను ఎక్కడం ఇదే చివరిసారి," అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

ఇబ్బందికి గురైన ప్రయాణికులను.. గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​ నాలుగు గంటల తర్వాత మరో విమానంలో గమ్యస్థానానికి తరలించినట్టు తెలుస్తోంది. "ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము," అని గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​ ఓ ట్వీట్​ చేసింది.

Go First airlines news : "ఘటన మా దృష్టికి వచ్చింది. నివేదిక సమర్పించాలని గో ఫస్ట్​ను ఆదేశించాము. విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటాము," అని ఓ డీజీసీఏ అధికారి.. మీడియాకు వెల్లడించారు.

నిత్యం వార్తల్లోనే విమానాలు..!

Air India urinating incident : దేశీయ విమాన సేవల్లో లోపాలు ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఎయిర్​ ఇండియా విమానంలో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం