తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Political Analysis: ‘ఆయన వ్యూహాలను ప్రజలే తిప్పికొట్టారు! దక్షిణాదిలో బీజేపీకి కష్టమే..!’

Political analysis: ‘ఆయన వ్యూహాలను ప్రజలే తిప్పికొట్టారు! దక్షిణాదిలో బీజేపీకి కష్టమే..!’

HT Telugu Desk HT Telugu

14 May 2023, 12:00 IST

    • Karnataka results 2023 : “కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరాజయం. సుడిగాలి పర్యటనలు, సుదీర్ఘ రోడ్​షోలతో ఆయన పడిన శ్రమ వృథా! బీజేపీ ఓటమికి కారణం ఏంటి? రాజకీయ విశ్లేషణలు ఇలా..
కర్ణాటక ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
కర్ణాటక ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (ANI/PIB)

కర్ణాటక ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ

Karnataka election results 2023 : వరుస విజయాలతో దూసుకెళుతున్న బీజేపీపై పిడుగు! కన్నడనాట కమలదళానికి ఘోర పరాభవం! ఉత్తరాదిలో సక్సెస్​ కొట్టిన వ్యూహాలు.. దక్షిణాదిలో బెడిసికొట్టాయని స్పష్టమైంది. 'కేరళ స్టోరీ', 'బజరంగ్​బలీ' వంటి మతపరమైన అంశాలను అడ్డుగా పెట్టుకుని ఓట్లు కొళ్లగొట్టాలని భావించిన కమలదళానికి.. కర్ణాటక ప్రజలు తమ ఓట్లతో సమాధానం చెప్పారు. దక్షిణాదిలో గెలవాలంటే.. అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని చెప్పకనే చెప్పారు!

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

కర్ణాటక ఎన్నికల్లో ఓటమి నుంచి ఆ పార్టీ 'స్టార్​ క్యాంపైనర్​'ను కాపాడేందుకు.. ఆయన మద్దతుదారులు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత శ్రమించినా.. ప్రజల తీర్పు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 224 సీట్లల్లో కేవలం 66 స్థానాలే కట్టబెట్టి.. తమ వ్యూహాలు మార్చుకోవాలని తేల్చి చెప్పారు ఓటర్లు!

ప్రజలే ఓడించారు..!

Karnataka election results BJP : ఈ దఫా ఎన్నికల ప్రచారాలను ప్రధాని మోదీ తన భుజాలపై వేసుకున్నారు. సుడిగాలి పర్యటనలు, భారీ ర్యాలీలు, సుదీర్ఘ రోడ్​ షోలతో కమలదళాన్ని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు పలు మార్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. మతాన్ని అడ్డుపెటుకుని ఓట్లను అడుగుతున్నట్టు చాలా మంది ఆరోపించారు. వీటిని సీరియస్​గా పరిగణించాల్సిన ఎన్నికల సంఘం.. పట్టించుకోలేదు! కానీ కర్ణాటక ఓటర్లు మాత్రం తీవ్రంగా పరిగణించారు. ఓట్ల ద్వారా తమ అసహనాన్ని వెళ్లగక్కారు.

దక్షిణాది ప్రజల్లో మన సంస్కృతి, సంప్రదాయాలపై నమ్మకం లేదన్నది 'ఆయన' అభిప్రాయం! 'దక్షిణాది ప్రజలు దేశ విద్రోహులు' అన్న మాట తప్ప దాదాపు అన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి కర్ణాటక ప్రజలకు అస్సలు నచ్చలేదు. ఫలితమే కాంగ్రెస్​ గెలుపు.. బీజేపీ ఘోర పరాజయం.

Karnataka BJP : ఆయన మాటలు నచ్చకో లేక అవినీతి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని లేకో.. 'బజరంగ్​బలీ' అని అంటూనే ప్రజలు ఆ పార్టీని ఓడించారు. లేకపోతే.. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఆయన.. ఓ స్థానిక స్థాయి రాజకీయ నేతగా మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ఓట్లను వెనకేసుకోవాలని ప్రయత్నించడం ప్రజలు జీర్ణించికోలేకపోయారేమో!

లేక ఆయన మాటలు ఆ బజరంగ్​బలీకే నచ్చలేదేమో! ఎన్నికల రాజకీయాల కోసం తన పేరును వాడుకుంటారా? అని శపించి.. ఆ పార్టీని ఒడించారేమో!

PM Modi Karnataka campaign : ఏది ఏమైనా.. బీజేపీని కర్ణాటక ఓటర్లు పక్కనపెట్టేశారు. ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదుగుతున్న వ్యక్తి.. అభివృద్ధి, స్వేచ్చపరమైన మాటలు మాట్లాడకుండా.. మతపరమైన వ్యాఖ్యలు చేసి తమను మోసం చేయలేరని నిరూపించారు. ఇంతకాలం 'నమో.. నమో' అన్న మనుషులు ఇప్పుడు 'నో మో.. నోమో' అనేడట్టుగా పరిస్థితి ఏర్పడింది! దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు తమ ఊహలకు పూర్తిగా భిన్నమన్న విషయాన్ని బీజేపీ ఇప్పటికైనా గ్రహించాలి. ఆర్థిక అనిశ్చితి, నిరుద్యోగం వంటి కీలక సమస్య గురించి మాట్లాడకుండా.. తమపై ఎన్నో నేరాలు ఉన్న 'బజరంగ్​ దళ్​'కు సానుభూతి పలుకుతూ ఆయన చేసిన మాటలు చైతన్యవంతమైన కర్ణాటకవాసులకు అస్సలు నచ్చలేదు.

కేరళ శాపం కూడా..!

ఎన్నికల ప్రచారాలతో ఆయనకు కేరళ శాపం తగిలినట్టుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్​ను ఓడించేందుకు.. పక్కనే ఉన్న కేరళను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉగ్రవాదానికి ఆ రాష్ట్రం అడ్డాగా మారిందని అన్నారు. మొత్తం కేరళ సమాజాన్నే అవమానించారు. కానీ కేరళ అభివృద్ధి గురించి ప్రజలు ఎప్పటినుంచో వింటూనే ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు!

Karnataka election results live : ఒక్క మాటలో చెప్పాలంటే.. బజరంగ్​బలీ, కేరళ స్టోరీ వంటి వాటిని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకున్న కమలదళానికి కర్ణాటక ఓటర్లు బుద్ధిచెప్పారు!

ఆయన ఛర్మిష్మాకు ప్రతిసారి ఓటర్లు ఓట్లు వేస్తారనుకోవడం పొరపాటే. అందుకు తాజా కర్ణాటక ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. నాయకుడిపై ఎంత నమ్మకం ఉన్నా.. ఆయన ఎప్పటికీ దేవుడు అవ్వలేరని కన్నడ ప్రజలు నిరూపించారు.

Karnataka politics latest news : హిందుత్వం అనేది ప్రేమకు చిహ్నం అని.. ద్వేషాన్ని వ్యాపించేందుకు ఉన్న ఓ సాధనం కాదన్న విషయం అధిష్టానానికి ఇప్పటికేనా అర్థం అవ్వాలి. నిజమైన 'సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​'ను సరిగ్గా ఉపయోగించుకుని ప్రజల ఆకలి కష్టాలను తీర్చాలి. లేకపోతే.. బీజేపీకి రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవు!

ఇలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల్లోనూ కష్టమే!

మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 'మిషన్​ సౌత్​' చేపట్టిన బీజేపీ.. కర్ణాటకలో చేసిన తప్పులే చేస్తే.. తెలంగాణలోనూ అదే ఫలితం రిపీట్​ అవ్వొచ్చు. హిందుత్వం, జాతీయవాదం, ప్రజల మనోభావాలను అడ్డుగా పెట్టుకుని గెలవలేమని (కనీసం దక్షిణాదిలో) కాషాయ పార్టీ ఇప్పటికైనా గ్రహించాలి.

Telangana elections 2023 : కర్ణాటకలో కమలదళం వ్యూహాలు బెడిసికొట్టాయి. అయితే తెలంగాణలో గెలవాలని బీజేపీ 2ఏళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. 'హిందూ ఎక్తా యాత్ర', 'కేరళ స్టోరీ'లతో గెలిచేస్తామని భావిస్తే మాత్రం.. బీజేపీ పొరబడినట్టే. కొత్త వ్యూహాలను రచించుకోకపోతే.. మరో రాష్ట్రంలో పరాజయం ఖాయమే!

— శ్యామ్​

(గమనిక:- ఇవి రచయిత అభిప్రాయాలు మాత్రమే. హెచ్​టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.)