తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka On Karnataka Results: ‘ప్రజలను ఏకం చేసే రాజకీయాలకు లభించిన విజయం ఇది’: ప్రియాంక గాంధీ

Priyanka on Karnataka results: ‘ప్రజలను ఏకం చేసే రాజకీయాలకు లభించిన విజయం ఇది’: ప్రియాంక గాంధీ

HT Telugu Desk HT Telugu

13 May 2023, 17:24 IST

  • Priyanka on Karnataka results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాజకీయాలు చేసేవారి విజయమన్నారు. ఇది విభజన రాజకీయాలు చేసే వారికి చెంపపెట్టు వంటి విజయమని వ్యాఖ్యానించారు.

ప్రియాంక గాంధీ (ఫైల్ ఫొటో)
ప్రియాంక గాంధీ (ఫైల్ ఫొటో) (PTI)

ప్రియాంక గాంధీ (ఫైల్ ఫొటో)

Priyanka on Karnataka results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాజకీయాలు చేసేవారి విజయమన్నారు. ఇది విభజన రాజకీయాలు చేసే వారికి చెంపపెట్టు వంటి విజయమని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Priyanka on Karnataka results: ఐక్యత రాజకీయాల విజయం

దేశాన్ని ఏకం చేసే రాజకీయాలు సాధించిన విజయంగా కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అభివర్ణించారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 13 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 12 రోడ్ షోలలో పాల్గొన్నారు. రెండుసార్లు ప్రత్యేకంగా మహిళలతో, ఒకసారి ప్రత్యేకంగా కార్మికులతో సమావేశమయ్యారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చిన కర్నాటక ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. కర్నాటక అభివృద్ధి కోసం వేసిన ఓటు ఇది. ఐక్యత రాజకీయాల విజయమిది’’ అని ప్రియాంక గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం