తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Results: కాంగ్రెస్ విజయంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్

Karnataka Results: కాంగ్రెస్ విజయంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్

HT Telugu Desk HT Telugu

13 May 2023, 19:55 IST

google News
  • కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. ఒకవైపు, ఫలితాలపై సీరియస్ చర్చ సాగగా.. మరోవైపు, హాస్యభరిత మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

కర్నాటకలో కాంగ్రెెస్ విజయంపై రూపొందిన ఒక మీమ్
కర్నాటకలో కాంగ్రెెస్ విజయంపై రూపొందిన ఒక మీమ్

కర్నాటకలో కాంగ్రెెస్ విజయంపై రూపొందిన ఒక మీమ్

Karnataka Election Result 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. ఒకవైపు, ఫలితాలపై సీరియస్ చర్చ సాగగా.. మరోవైపు, హాస్యభరిత మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 224 స్థానాలకు గానూ 136 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఓటమి పరంపర కొనసాగుతున్న కాంగ్రెస్ కు ఈ విజయం ఆక్సీజన్ గా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మీమ్స్ ఇవే..

ఎన్నికల ఫలితాల అనంతరం ఇది బీజేపీ హెడ్ క్వార్టర్ పరిస్థితిపై ట్విటర్ లో ఒక నెటిజన్ స్పందన ఇది..

కాంగ్రెస్ అనూహ్య విజయంపై ఇదో తరహా స్పందన..

కాంగ్రెస్ విజయంపై సోషల్ మీడియా స్పందనల్లో ఒకటి

ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ విజయాలకు ముఖం వాచిపోయింది. దాదాపు ప్రతీ ఎన్నికలోనూ పరాజయమే ఆ పార్టీని పలకరిస్తోంది. దాంతో కర్నాటక గెలుపుపై నెటిజన్లు ఇలా స్పందించారు..

పరాజయ పరంపర మధ్య కాంగ్రెస్ సాధించిన ఈ విజయాన్ని చూసిన వారి స్పందన ఇలా ఉందంటూ ఒక నెటిజన్ రూపొందించిన మీమ్

అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీగా ప్రకటించింది. దాంతో, ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయాన్ని చూస్తున్న బజరంగ్ దళ్ అంటూ ఒక నెటిజన్ స్పందన ఇది..

కాంగ్రెస్ విజయంపై బజరంగ్ దళ్ స్పందన ఇలా ఉందంటూ ఒక నెటిజన్ రూపొందించిన మీమ్
తదుపరి వ్యాసం