తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Results: ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఓటమిపాలు..

Karnataka results: ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఓటమిపాలు..

HT Telugu Desk HT Telugu

13 May 2023, 20:28 IST

  • Karnataka results: 2018 నాటి ఎన్నికల అనంతరం, బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2019 లో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆ ప్రభుత్వం కుప్పకూలి, యెడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ సర్కారు మరోసారి ఏర్పడింది. 

బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యెడియూరప్ప
బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యెడియూరప్ప (HT_PRINT)

బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యెడియూరప్ప

Karnataka results: 2018 నాటి ఎన్నికల అనంతరం, బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2019 లో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో జేడీఎస్ నేత కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి, యెడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ సర్కారు మరోసారి ఏర్పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ ను, జేడీఎస్ ను వీడిన ఎమ్మెల్యేల్లో పలువురు ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు.

Karnataka results: 8 మంది ఓటమిపాలు

అలా పోటీ చేసిన ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన 13 మంది ఎమ్మెల్యేలను, జేడీఎస్ నుంచి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలను నాటి స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంతో కర్నాటకలో నాడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో మళ్లీ బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొంది, యెడియూరప్ప ప్రభుత్వంలో మంత్రులు కూడా అయ్యారు. వారిలో మళ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రతాప్ గౌడ్ పాటిల్ (మస్కీ), బీసీ పాటిల్ (హిరెకరూర్), ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ ఓటమి పాలయ్యారు. డాక్టర్ సుధాకర్ (చిక్ బళ్లాపుర) తరఫున తెలుగు ప్రముఖ కమేడియన్ బ్రహ్మానందం కూడా ప్రచారం చేశారు. అలాగే, నాటి తిరుగుబాటు ఎమ్మెల్యేలైన ఎంటీబీ నాగరాజు ((Hoskote), శ్రీమంత్ పాటిల్ (Kagwad), మహేశ్ కుమతళ్లి (Athani) కూడా ఓటమి పాలయ్యారు. వీరిలో మహేశ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన లక్ష్మణ్ సావది చేతిలోనే ఓడిపోయారు. అలాగే, నాటి తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో భాగమైన నారయణ గౌడ (K R Pet), ఆర్ శంకర్ (Ranibennur) కూడా ఓడిపోయారు. నాటి తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో శివరామ్ హెబ్బార్(Yellapur), ఎస్టీ సోమశేఖర (Yeshwanthpur), బైరాటి బస్వరాజ (K R Puram), ఎన్ మునిరత్న (R R Nagar), రమేశ్ ఝర్కోలి (Gokak), కే గోపాలయ్య (Mahalakshmi Layout) ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఇద్దరికి ఈ సారి బీజేపీ టికెట్ లభించలేదు.