తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indeed Job Cuts: సొంత ఉద్యోగులకు షాకిచ్చిన జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍డీడ్: వేలాది మంది తొలగింపు

Indeed Job Cuts: సొంత ఉద్యోగులకు షాకిచ్చిన జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍డీడ్: వేలాది మంది తొలగింపు

23 March 2023, 10:38 IST

  • Indeed Layoff: జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍డీడ్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. మొత్తంగా 2,200 మంది ఎంప్లాయిస్‍ను తీసేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

Indeed Job Cuts: సొంత ఉద్యోగులకు షాకిచ్చిన జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍డీడ్
Indeed Job Cuts: సొంత ఉద్యోగులకు షాకిచ్చిన జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍డీడ్

Indeed Job Cuts: సొంత ఉద్యోగులకు షాకిచ్చిన జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍డీడ్

Indeed Layoff: ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే (Job Cuts) ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోని అమెరికాకు చెందిన జాబ్ సెర్చ్ ప్లాట్‍ఫామ్ ఇండీడ్ (Indeed) వచ్చి చేరింది. సంస్థలో మొత్తం 2,200 మంది ఉద్యోగులను తొలగించున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 15 శాతం మందిని తీసేయనున్నట్టు వెల్లడించింది. జాబ్స్ మార్కెట్ తక్కువ ఉంటుందనే అంచనాలతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ఆ సంస్థ సీఈవో క్రిస్ హ్యామ్స్ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

కారణాలివే..

Indeed Job Cuts: ఇండీడ్ ఆదాయం 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో గణనీయంగా తగ్గనుందని ఆ సంస్థ సీఈవో క్రిస్ వెల్లడించారు. కరోనా ముందు పరిస్థితి కంటే అమెరికాలో జాబ్ ఓపెనింగ్స్ మించవని, తదుపరి రెండు, మూడు సంవత్సరాల్లో పడిపోతాయని ఆయన చెప్పారు. దీంతో తాము ఉద్యోగులను తగ్గించుకోక తప్పడం లేదని తెలిపారు.

Indeed Layoff: తొలగింపునకు గురవనున్న ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు రావాల్సిన బోనస్, మార్చి నెల రెగ్యులర్ వేతనం, పెయిడ్ టైమ్ ఆఫ్, మెంటల్ హెల్త్ సర్వీసు‍ల యాక్సెస్ సహా మరిన్నింటిని సెవెరెన్స్ ప్యాకేజీలో ఇవ్వనున్నట్టు తన బ్లాగ్ పోస్టులో ఇండీడ్ ప్రకటించింది. ఇక కంపెనీ సీఈవో క్రిస్ హ్యామ్స్.. తన వేతనంలో 25 శాతం కోత విధించుకున్నారు.

Meta, Amazon Layoffs: ప్రముఖ సంస్థలు మెటా, అమెజాన్ ఇటీవల రెండో రౌండ్ లేఆఫ్‍లను ప్రకటించాయి. 9వేల మంది ఉద్యోగులను అమెజాన్ తాజాగా తొలగించింది. గత సంవత్సరం 18వేల మందిని ఇంటికి పంపిన ఆ సంస్థ మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్ చేసింది. గత సంవత్సరం ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా 11వేల మంది ఎంప్లాయిస్‍ను తొలగించింది. అయితే ఇంకో 10వేల మందిని తీసేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. ఆదాయం తగ్గుతుండటం, ఆర్థిక పరిస్థితిలో అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ఆందోళన కారణాలతో ఉద్యోగులను సంస్థలు తీసేస్తున్నాయి.

ఇక టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, హెచ్‍పీతో పాటు పదుల సంఖ్యలో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ లేఆఫ్స్ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి.