తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Layoffs: ఆమెజాన్ లో మళ్లీ ఉద్యోగాల కోత

Amazon layoffs: ఆమెజాన్ లో మళ్లీ ఉద్యోగాల కోత

HT Telugu Desk HT Telugu

21 March 2023, 15:13 IST

  • Amazon layoffs: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ (Amazon) లో మరోసారి ఉద్యోగుల తొలగింపు చేపట్టనున్నట్లు సీఈఓ యాండీ జెస్సీ వెల్లడించారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: HT)

ప్రతీకాత్మక చిత్రం

Amazon layoffs: ఆమెజాన్ (Amazon) లో లే ఆఫ్ (layoff) సీజన్ కొనసాగుతోంది. తాజాగా రానున్న కొన్ని వారాల్లో ఆమెజాన్ వెబ్ సర్వీస్, హెచ్ఆర్, అడ్వర్టైజింగ్, లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ విభాగాల నుంచి సుమారు 9 వేల మంది ఉద్యోగులను తొలగించాలని (layoff) నిర్ణయించారు.

9 thousand more layoffs in Amazon : 9 వేల మంది

తాజా లే ఆఫ్ (layoff) నిర్ణయంతో ఆమెజాన్ (Amazon) లోని సుమారు 9 వేల మంది ఉద్యోగులు తమ జాబ్ లను కోల్పోనున్నారు. ముఖ్యంగా ఆమెజాన్ వెబ్ సర్వీస్ (Amazon Web Service), హెచ్ఆర్ (human resources), అడ్వర్టైజింగ్ (advertising), లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ (livestreaming service) విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించాలని (layoff) నిర్ణయించారు. ఇప్పటికే భారీగా ఉద్యోగులను తొలగించిన ఆమెజాన్ (Amazon).. తాజా నిర్ణయంతో మరో 9 వేల మందిపై వేటు వేయనుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం, భవిష్యత్తులో మరికొన్ని సంవత్సరాల పాటు రిసెషన్ (recession) కొనసాగే అవకాశం, ఆదాయం తగ్గే సంకేతాలు.. మొదలైన అంశాల నేపథ్యంలో ఈ లే ఆఫ్ (layoff) నిర్ణయం తీసుకున్నట్లు ఆమెజాన్ (Amazon) సీఈఓ యాండీ జెస్సీ వివరించారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నామని, ఇప్పుడు ఆ ఉద్యోగాలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని వెల్లడించారు.

Amazon layoffs: గత నెలలోనే 18 వేల మంది..

గత నెలలోనే ఆమెజాన్ సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన (layoff) పలికింది. వారిలో ఎక్కువమంది హెచ్ఆర్, రిక్రూటింగ్ టీమ్ ల వారే ఉన్నారు. ఆమెజాన్ (Amazon) మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఈ కామర్స్, సోషల్ మీడియా, టెక్నాలజీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను (layoff) తొలగిస్తున్నాయి. ఫేస్బుక్ (facebook) యాజమాన్య సంస్థ మెటా (meta) సుమారు 21 వేల మందిని తొలగించింది. ఈ లేఆఫ్ (layoff) ప్రాసెస్ మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Jukerberg)) స్పష్టం చేశారు. ఇవి కాకుండా, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, డెల్ టెక్నాలజీస్, డిస్నీ, ట్విటర్.. తదితర సంస్థలు కూడా పెద్ద ఎత్తున తమ ఉద్యోగులకు లే ఆఫ్ (layoff) ప్రకటించాయి.

టాపిక్