List of layoffs by major firms: 2022లో ప్రారంభమైన లే ఆఫ్ (layoff) ముప్పు.. 2023 లో మరింత తీవ్రమైంది. ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇప్పటికే 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ మరో 10 వేల ఉద్యోగాలకు ఎసరు (layoff) పెట్టనుంది. అమెరికా బయో టెక్నాలజీ సంస్థ యామ్ జెన్ (Amgen Inc) కూడా 450 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది ఆ సంస్థ మొత్తం వర్క్ ఫోర్స్ లో సుమారు 2%. ,2 lakh lay offs: వేలల్లోనే లే ఆఫ్ లు..ప్రముఖ ఐటీ సంస్థలు, టెక్నాలజీ దిగ్గజాలు, ఈ కామర్స్ మేజర్స్, ఫార్మా సంస్థలు, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు.. అన్ని రంగాల్లోనూ కంపెనీలు ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని (layoff) చేపట్టాయి. ఆర్థిక మాంద్యం, అధిక ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చుల్లో పెరుగుదల, ఆదాయంలో లోటు.. వంటివి సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ,worse than 2008 recession: 2008 రిసెషన్ టైమ్ కన్నా దారుణం..ట్విటర్, మెటా, ఆమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ మొదలైన సంస్థలు వేలల్లోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన (layoff) పలికాయి. Layoffs.fyi డేటా ప్రకారం 2022 సంవత్సరంలో మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఉద్వాసనకు (layoff) గురయ్యారు. చాలెంజర్, గ్రే అండ్ క్రిస్ట్మస్ అనే అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం 2022 లో మొత్తం 1004 సంస్థలు 1,52,421 మంది ఉద్యోగులకు లే ఆఫ్ (layoff) ప్రకటించాయి. ఇది 2008 నాటి గ్రేట్ రిసెషన్ టైమ్ లో పోయిన ఉద్యోగాల సంఖ్య కన్నా చాలా ఎక్కువ. 2008 రిసెషన్ టైమ్ లో 65 వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ,List of layoffs by major firms: ఏ సంస్థలో ఎందరు? గత సంవత్సరం ట్విటర్ (twitter) 10 వేలకు పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. ఐబీఎం (IBM)లో 4,900 మంది ఉద్యోగులు, స్పాటిఫై లో 600 మంది ఉద్యోగులు, మెటా (Meta) 11,000 మంది ఉద్యోగులు, ఆల్ఫాబెట్ (Alphabet) లో 12 వేల మంది ఉద్యోగులు, మైక్రోసాఫ్ట్ (Microsoft) లో 1000 మంది ఉద్యోగులు, ఆమెజాన్ (Amazon) లో 18 వేల మంది ఉద్యోగులు లే ఆఫ్ (layoff) బారిన పడ్డారు.