తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jeff Bezos Girlfriend: స్పేస్‌లోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు సంచేజ్

Jeff Bezos girlfriend: స్పేస్‌లోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు సంచేజ్

HT Telugu Desk HT Telugu

15 November 2022, 9:41 IST

  • Lauren Sánchez: జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ సంచేజ్ త్వరలో అంతరిక్షంలోకి వెళ్లి రానున్నారు.

జెఫ్ బెజోస్ ప్రియురాలు సంచేజ్
జెఫ్ బెజోస్ ప్రియురాలు సంచేజ్ (Instagram/@laurenwsanchez)

జెఫ్ బెజోస్ ప్రియురాలు సంచేజ్

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 2021లో అంతరిక్షంలో 11 నిమిషాల పాటు గడిపివచ్చారు. ఆయన సొంత కంపెనీ బ్లూ ఆరిజిన్ తయారు చేసిన రాకెట్‌లోనే స్పేస్ ట్రిప్ పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ సంచేజ్ కూడా స్పేస్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. 2023లో ఈ అంతరిక్షయాత్ర పూర్తిచేయాలని భావిస్తున్నారు. అయితే తన పార్ట్‌నర్‌తో కాకుండా కొందరు మహిళలతో కలిసి ఈ యాత్ర చేయనున్నట్టు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఎమ్మీ అవార్డు గ్రహీత అయిన సంచేజ్ ఈ విషయాలను సీఎన్ఎన్‌తో పంచుకున్నారు. ఆమె తన సహ ప్రయాణికుల పేర్లు బహిర్గతం చేయలేదు గానీ బెజోస్ మాత్రం ఈ జాబితాలో లేరని స్పష్టం చేశారు. ‘గొప్ప మహిళలతో కూడిన బృందం’గా ఆమె అభివర్ణించారు. అంతరిక్ష ప్రయాణం సాధారణ ప్రజలకు కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని, అదీ తన జీవితకాలంలోనే సాధ్యమవుతుందని జెఫ్ బెజోస్ విశ్వసిస్తున్నారు.

సంచేజ్ ఎంటర్‌టైన్మెంట్ రిపోర్టర్, న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. బెజోస్ తన భార్య మాక్‌కెంజీ స్కాట్‌తో విడిపోయిన అనంతరం సంచేజ్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించారు.

సంచేజ్ హెలిక్యాప్టర్ పైలట్ లైసెన్స్ తీసుకుని బ్లాక్ ఓపీఎస్ ఏవియేషన్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ఏరియల్ ఫోటోగ్రఫీ సేవలు అందిస్తుంది. బెజోస్ ఎర్త్ ఫండ్‌కు వైస్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నారు. క్లైమేట్ ఛేంజ్, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ఈ సంస్థ నిమగ్నమైంది. తన సంపదలో మెజారిటీ భాగం క్లైమేట్ ఛేంజ్ కోసం విరాళంగా ఇస్తానని గతంలో బెజోస ప్రకటించారు. బెజోస్ తన సంపదలో గణనీయమైన భాగాన్ని విరాళంగా ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేయడం అదే మొదటిసారి.

టాపిక్