Amazon CEO Jeff Bezos sued: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍పై కేసు-amazon ceo jeff bezos sued by former housekeeper over unsanitary working conditions long hours ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amazon Ceo Jeff Bezos Sued: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍పై కేసు

Amazon CEO Jeff Bezos sued: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍పై కేసు

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 06:55 PM IST

Amazon Founder Jeff Bezos sued : అమెజాన్ సీఈవో, బిలీనియర్ జెఫ్ బెజోస్‍పై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జెజోస్ ఇంట్లో గతంలో హౌస్‍కీపర్‍గా పని చేసిన ఓ మహిళ అనేక ఆరోపణలతో జెజోస్‍పై కోర్టును ఆశ్రయించారు.

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍

Amazon Founder Jeff Bezos sued : అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్‍కు కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ఆయన ఇంట్లో గతంలో పని చేసిన ఓ హోస్‍కీపర్ కోర్టును ఆశ్రయించారు. బెజోస్‍పై దావా వేశారు. ఆయన ఇంట్లో విధులు నిర్వహించిన సమయంలో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, అపరిశుభ్రమైన దారుణ పరిస్థితుల్లో పని చేశామనే ఆరోపణలతో కోర్టుకెక్కారు. కనీస విశ్రాంతి కూడా ఇవ్వకుండా అధిక గంటలు పని చేయించుకున్నారని ఆరోపించారు. వాష్‍రూమ్‍లను వాడుకునేందుకు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

Amazon Founder Jeff Bezos sued : జాతి వివక్ష ఎదుర్కొన్నా..

సియాటెల్ స్టేట్ కోర్టులో మర్సెడెజ్ వెడా (Mercedes Wedaa) అనే మహిళ జెఫ్ బెజోస్‍పై ఈ వ్యాజ్యం వేశారు. 2019లో ఆమె బెజోస్ ఇంట్లో విధులకు చేరారు. ఐదుగురు నుంచి ఆరుగురు హౌస్‍కీపర్లకు తాను సూపర్‍వైజర్‍గా విధులు నిర్వర్తించానని, చాలాసార్లు 10 నుంచి 14 గంటలు పని చేశామని ఆమె పేర్కొన్నారు. జాతి వివక్షను కూడా ఎదుర్కొన్నామని ఆరోపించారు. వాష్‍రూమ్‍లను వినియోగించుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడ్డామని ఫిర్యాదులో ఆరోపించారు. జెఫ్ బెజోస్‍తో పాటు ఆయన ప్రాపర్టీలు, పెట్టుబడులను మేనేజ్‍ చేసే జెఫ్రామ్ ఎల్ఎల్‍సీ, నార్త్ వెస్ట్రన్ ఎల్‍ఎల్‍సీపై కూడా వ్యాజ్యం దాఖలు చేశారు వెడా.

Amazon Founder Jeff Bezos sued : వాష్ రూమ్ సౌకర్యం కూడా లేదు

హౌస్‍కీపింగ్ సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు కనీస స్థలాన్ని కూడా బెజోస్ ఇంట్లో కేటాయించలేదని కోర్టులో వెడా ఫిర్యాదు చేశారు. దుస్తులు ఉతికే రూమ్‍లో తాము ఆహారం తినాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా అపరిశుభ్రమైన, దయనీయ పరిస్థితుల్లో పని చేశామని తెలిపారు. సెక్యూరిటీ రూమ్ సమీపంలోని టాయ్‍లెట్‍లను వినియోగించుకోకుండా తమపై ఆంక్షలు విధించారని, కిటికీ ద్వారానే లోపలికి వెళ్లాలని బలవంతం చేసేవారని వెడా ఆరోపించారు. బెజోస్ ఇంటిని చూసుకునే మేనేజర్లు చాలాసార్లు తమపై దురుసుగా ప్రవర్తించారని, తిట్టారని దావాలో పేర్కొన్నారు. ఆ విషయాలపై ఫిర్యాదు చేయడంతో మూడు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన తనను తొలగించారని వెడా పేర్కొన్నారు. తనకు నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు.

Amazon Founder Jeff Bezos sued : అసత్య ఆరోపణలు

మరోవైపు మర్సెడెజ్ వెడా ఆరోపణలను బెజోస్ తరఫు న్యాయవాది ఖండించారు. బెజోస్ ఇంట్లో పని చేసినందుకు ఆమె ఆరంకెల వేతనం పొందారని అన్నారు. బ్రేక్ రూమ్‍లతో పాటు అన్ని సదుపాయాలు హౌస్ కీపర్లకు అందుబాటులో ఉండేవని కోర్టులో చెప్పారు. దురుసు ప్రవర్తన కారణంగానే ఆమె ఉద్యోగం కోల్పోయారని వాదించారు.

Whats_app_banner

టాపిక్