Indigo sweet 16 sale : రూ. 1,616తో విమాన ప్రయాణం.. ఆఫర్‌కు నేడే చివరి రోజు
05 August 2022, 10:07 IST
- Indigo sweet 16 sale : ఇండిగో ప్రవేశపెట్టిన అదిరిపోయే ఆఫర్ నేటితో ముగియనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1,616తో విమాన ప్రయాణం.. ఆఫర్‌కు నేడే చివరి రోజు
Indigo sweet 16 sale : ఇండిగో విమానయాన సంస్థ తీసుకొచ్చిన 'స్వీట్ 16' ఆఫర్ నేటితో ముగియనుంది. 16 వసంతాల సంస్థ ప్రయాణాన్ని పురస్కరించుకుని.. ఈ నెల 3న ఈ ఆఫర్లను ఆవిష్కరించింది ఇండిగో. 2022 ఆగస్టు 18 నుంచి 2023 జులై 16 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇండిగో ప్రకారం.. ఈ ఆఫర్లతో తక్కువ ఖర్చుతోనే దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు!
"మా స్వీట్ 16 వచ్చేసింది. మీకోసం స్వీట్ ఆఫర్ తీసుకొచ్చాము. రూ. 1,616తో మొదలయ్యే టికెట్లను బుక్ చేసుకోండి(కండీషన్స్ అప్లై). ఇక ఆలస్యం చేయకండి. https://bit.ly/3vC8JhE లో బుక్ చేసుకోండి," అని ఇండిగో సంస్థ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసింది.
6ఈ రివార్డ్స్‌తో టికెట్లు బుక్ చేసుకుంటే 25శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. హెచ్ఎస్బీసీతో టికెట్లు బుక్ చేసుకుంటే రూ. 800 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
అయితే.. ఈ ఆఫర్లో ఎన్ని సీట్లు కేటాయించారు? ఎన్ని విమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది అన్న విషయాలను ఇండిగో సంస్థ వెల్లడించలేదు. కానీ చాలా తక్కువ మందికే ఈ ఆఫర్‌ను ఇచ్చేందుకు, అది కూడా సమయానికి తగ్గట్టు చూసుకోవాలని ఇండిగో భావిస్తోంది.
మరోవైపు.. ఈ ఆఫర్‌ను ఇతర స్కీమ్, ఆఫర్లు, ప్రొమోషన్లు, నాన్-ఎన్క్యాషెబుల్, నాన్-ట్రాన్సఫరెబుల్, నాన్-ఎక్స్ఛెంజిబుల్ వాటితో కలపలేరు. ఇండిగో గ్రూప్ బుకింగ్స్‌పైనా ఈ ఆఫర్ చెల్లదు.