తెలుగు న్యూస్  /  National International  /  Indigo's Technicians Go On Sick Leave In Hyderabad, Delhi To Protest Against Low Salaries

IndiGo : మళ్లీ ‘సెలవులు’ పెట్టేసిన ఇండిగో ఉద్యోగులు..!

Sharath Chitturi HT Telugu

10 July 2022, 18:38 IST

  • Indigo : ఇండిగోలో ‘సెలవుల’ హడావుడి నడుస్తోంది. తాజాగా.. అనేకమంది టెక్నీషియన్లు.. ఒకేసారి సెలవులు పెట్టేశారు.

మళ్లీ ‘సెలవులు’ పెట్టేసిన ఇండిగో ఉద్యోగులు..!
మళ్లీ ‘సెలవులు’ పెట్టేసిన ఇండిగో ఉద్యోగులు..! (HT_PRINT)

మళ్లీ ‘సెలవులు’ పెట్టేసిన ఇండిగో ఉద్యోగులు..!

Indigo : దేశీయ విమానాయన సంస్థ ఇండిగోలో సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. వేతనాలపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టేస్తున్నారు. తాజాగా.. గత రెండు రోజులుగా విమాన నిర్వహణ టెక్నీషియన్లు.. సిక్​ లీవ్​లు పెట్టినట్టు ఓ నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

తక్కువ జీతాలపై నిరసన తెలిపేందుకు హైదరాబాద్​, ఢిల్లీకి చెందిన టెక్నీషియన్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమపై యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా.. 'సిక్​ లీవ్​'లను ఉపయోగించుకున్నారు.

కాగా ఈ వ్యవహారంపై ఇండిగో ఇంకా స్పందించలేదు.

అయితే వేతనాలపై ఇండిగో ఉద్యోగులు ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం.. ఇండిగోకు చెందిన చాలామంది పెలట్లు, క్యాబిన్​ సిబ్బంది.. ఒకేసారి సెలవులు పెట్టి.. ఎయిర్​ ఇండియాలో రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కు వెళ్లారు! ఫలితంగా.. 55శాతం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.

కొవిడ్​-19 పేరుతో ఉద్యోగుల జీతాలను గతంలో తగ్గించేసింది ఇండిగో. వాటిని ఇంకా పెంచలేదు. ఫలితంగా ఉద్యోగుల్లో అసంతృప్తి, అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది.

ఇదిలా ఉండగా.. బిగ్​ బుల్​ రాకేష్​ ఝన్​ఝున్​వాలాకు చెందిన ఆకాశా ఎయిర్​లైన్స్​ కూడా నియామకాల కోసం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇండిగో ఉద్యోగులు వాటిపైనా కన్నేసినట్టు సమాచారం.