ఎయిర్​ ఇండియా ఇంటర్వ్యూ కోసం.. ‘ఇండిగో’ ఉద్యోగుల క్యూ.. అందుకే విమానాలు లేట్​!-55 indigo domestic flights delayed as crew call sick on ai recruitment day dgca to probe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  55% Indigo Domestic Flights Delayed As Crew Call Sick On Ai Recruitment Day; Dgca To Probe

ఎయిర్​ ఇండియా ఇంటర్వ్యూ కోసం.. ‘ఇండిగో’ ఉద్యోగుల క్యూ.. అందుకే విమానాలు లేట్​!

Sharath Chitturi HT Telugu
Jul 03, 2022 09:39 PM IST

Indigo : ఎయిర్​ ఇండియాలో శనివారం ఇంటర్వ్యూలు జరిగాయి. కాగా.. ఇందులో పాల్గొనేందుకు చాలా మంది ఇండిగో సంస్థ ఉద్యోగులు.. ఒక్కసారిగా సిక్​ లీవ్​లు పెట్టేశారు. ఫలితంగా శనివారం.. ఇండిగో విమానాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇండిగో
ఇండిగో (HT_PRINT)

Indigo : ఇండిగో దేశీయ విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 55శాతం విమానాలు శనివారం ఆలస్యంగా ప్రయాణించాయి. కాగా.. ఇండిగో సిబ్బంది ఒకేసారి సెలవులు పెట్టి ఎయిర్​ ఇండియా నిర్వహించిన రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కు వెళ్లడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఎయిర్​ ఇండియా రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ రెండో దశ.. శనివారం జరిగింది. ఇండిగో క్యాబిన్​ క్రూ సభ్యుల్లో చాలామంది.. ఒక్కసారిగా సిక్​ లీవ్స్​ పెట్టేశారు. తొలుత ఎవరికి అర్థం కాలేదు. చివరికి డాట్స్​ కనెక్ట్​ చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది.

ఈ వ్యవహారంపై ఎయిర్​ ఇండియా, ఇండిగో సంస్థలు స్పందించలేదు. కాగా.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు ఏవియేషన్​ నియంత్రణ సంస్థ డీజీసీఏ మీడియాకు వెల్లడించింది.

కష్టాల్లో ఇండిగో!

దేశంలోని అతిపెద్ద విమానయన సంస్థల్లో ఇండిగో ఒకటి. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద 1,600 విమానాలు ఉన్నాయి. కాగా.. శనివారం దేశీయంగా కేవలం 45.2శాతం విమానాలే సమయానికి నడిచాయి.

జీతాల విషయంలో ఇండిగో ఉద్యోగులు కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వేతనాలు పెంచలేమని ఈ ఏడాది 8న.. ఇండిగో సీఈఓ రంజోయ్​ దత్త.. ఉద్యోగులకు తేల్చిచెప్పేశారు. కాగా.. ఈ విషయంపై ఏప్రిల్​ నెలలో నిరసనలు చేపడదాము అని అనుకున్న పైలట్లను.. ఒక రోజు ముందే సస్పెండ్​ చేసింది ఇండిగో.

కొవిడ్​ పీక్​ దశలో ఉన్నప్పుడు.. పైలట్ల జీతాలను 30శాతం వరకు కట్​ చేసింది ఇండిగో సంస్థ.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్