తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indigo | మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టిన ఇండిగో ఉద్యోగులు.. కారణం ఏమై ఉంటుంది?

Indigo | మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టిన ఇండిగో ఉద్యోగులు.. కారణం ఏమై ఉంటుంది?

04 July 2022, 13:31 IST

  • ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది పెద్దఎత్తున శనివారం సిక్ లీవ్ పెట్టారు. ఇన్‌ఫ్లైట్ సిబ్బంది అస్వస్థత కారణంగా ఆ రోజు చాలా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. సంస్థ నిర్వహించే మొత్తం విమానాలలో 55 శాతం జూలై 2న ప్రభావితమైనట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి సిబ్బంది అంతా ఒకేసారి గైర్హాజరు కావటానికి కారణలేంటి? వారికి ఏమై ఉంటుంది అని ఆరాలు తీయగా పలురకాల ఊహాగానాలు వచ్చాయి. ఆరోజున ఎయిర్ ఇండియా ఇంటర్వ్యూ నిర్వహించడం చేతనే ఇండిగో ఉద్యోగులంతా ఆ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు 'మాస్ బంక్' కొట్టినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఉద్యోగులంతా కలిసి వివిధ కారణాలతో శనివారం రోజున పనిచేయకూడదు అని నిర్ణయించుకోవడం లేదా పార్టీకి చేసుకోవడం ఏదైనా ఉండవచ్చునని కథనాలు వస్తున్నాయి. అయితే ఇండిగో మాత్రం ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి..