తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indigo Plane Skids Off: టేకాఫ్‌కు ముందు రన్‌వే నుంచి స్కిడ్ అయిన ఇండిగో విమానం

IndiGo plane skids off: టేకాఫ్‌కు ముందు రన్‌వే నుంచి స్కిడ్ అయిన ఇండిగో విమానం

HT Telugu Desk HT Telugu

29 July 2022, 10:07 IST

    • జోర్హాట్ (అస్సోం), జూలై 29: 98 మంది ప్రయాణికులతో కోల్‌కతాకు బయల్దేరిన ఇండిగో విమానం గురువారం అస్సోంలోని జోర్హాట్ విమానాశ్రయంలో టేకాఫ్ కోసం ప్రయత్నిస్తుండగా రన్‌వేపై నుంచి జారిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇండిగో విమానం (ప్రతీకాత్మక చిత్రం)
ఇండిగో విమానం (ప్రతీకాత్మక చిత్రం) (Bloomberg)

ఇండిగో విమానం (ప్రతీకాత్మక చిత్రం)

IndiGo plane skids off: ఇండిగో ఫ్లైట్ 6E-757 షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 2:20 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉంది. రన్‌వేపై టేకాఫ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు విమానం చక్రాలు టార్మాక్‌కు దూరంగా రన్‌వే పక్కన ఉన్న నేలపైన మెత్తటి బురదలో కూరుకుపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఎయిర్‌పోర్టును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తుండడంతో ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత భారత వైమానిక దళం సహాయంతో ప్రయాణికులను దించేశారు.

సమస్యను పరిష్కరించడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సుమారు ఆరు గంటలపాటు ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమాన సర్వీసును రద్దు చేయవలసి వచ్చింది.

‘జోర్హాట్ నుండి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E-757 రద్దయ్యింది. టేకాఫ్‌కు ముందు రన్‌వేపై వెళుతుండగా ప్రధాన చక్రం ఒకటి టాక్సీ వేకు ఆనుకుని ఉన్న గడ్డిపైకి పాక్షికంగా వెళ్లింది..’ అని ఇండిగో తెలిపింది.

ఈ ప్రమాదంలో ప్రయాణీకులెవరూ గాయపడలేదు. దర్యాప్తు కోసం అంతర్గత బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఇండిగో విమానాలకు సంబంధించిన అనేక అవాంఛనీయ సంఘటనలు ఇటీవలికాలంలో చోటుచేసుకున్నాయి.

ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇస్తూ జూలై 1, 2021 నుచంి జూన్ 30, 2022 మధ్య మొత్తం 478 సాంకేతిక స్నాగ్-సంబంధిత సంఘటనలు విమానాలలో నమోదయ్యాయి.

జూలై 17న షార్జా నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని విమానంలో లోపం తలెత్తిందని తెలియడంతో పాకిస్థాన్‌కు మళ్లించారు.

విమానాన్ని ముందుజాగ్రత్తగా కరాచీలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులను తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడానికి అదనపు విమానాన్ని కరాచీకి పంపుతామని భారత క్యారియర్ తెలిపింది.

టాపిక్