తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indigo Flight Vs Car | విమానాన్ని ఢీకొట్టిన కార్.. తర్వాతేమైంది? ఈ వీడియో చూడండి

Indigo Flight vs Car | విమానాన్ని ఢీకొట్టిన కార్.. తర్వాతేమైంది? ఈ వీడియో చూడండి

02 August 2022, 19:11 IST

గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఒక కారు రన్‌వేపై బయలుదేరేందుకు సిద్ధంగా ఇండిగో ఎ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్ కిందకు దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం ముందు చక్రాన్ని స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్‌ మద్యం సేవించాడేమో అని అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, నెగెటివ్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఏదేమైనా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా DGCA - సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూడండి.