New year celebrations in India : దేశంలో న్యూ ఇయర్ వేడుకలు.. ‘తగ్గేదే లే!’
01 January 2023, 7:20 IST
India New Year celebrations 2023 : దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు, సంబరాలు అంబరాన్ని తాకాయి! ప్రజలు ఎంతో ఉత్సాహంగా 2023కు స్వాగతం పలికారు.
2023కు ఘన స్వాగతం పలికిన భారతీయులు..
India New Year celebrations 2023 : దేశవ్యాప్తంగా 2023 న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన ఏడాదికి టపాసులు, మ్యూజిక్, స్టెప్పులతో స్వాగతం పలికారు భారతీయులు. ఈ నూతన ఏడాది అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ప్రార్థనలు చేశారు.
దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో.. సంబరాలు అంబరాన్ని తాకే విధంగా జరిగాయి. ఢిల్లీ నుంచి ముంబై వరకు.. చెన్నై నుంచి కోల్‌కతా వరకు 'తగ్గేదే లే!' అన్న రీతిలో 2023 న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు ప్రజలు.
ఢిల్లీలో అలా.. ముంబైలో ఇలా..
Delhi New Year Celebrations : ఢిల్లీలో శనివారం రాత్రి 9-10 గంటల నుంచి న్యూ ఇయర్ వైబ్స్ మొదలయ్యాయి. పబ్స్, క్లబ్స్ అన్ని యువతతో కళకళలాడిపోయాయి. ప్రత్యేక పార్టీలతో వీధులన్నీ మెరిసిపోయాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో.. ప్రజలు భారీ సంఖ్యల్లో గుమిగూడి.. చిందులేశారు.
ప్రపంచవ్యాప్తంగా.. ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు- పిక్స్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ముంబైలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన ఏడాది వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలతో.. మెరైన్ డ్రైవ్ కిటకిటలాడిపోయింది. మ్యూజిక్‌తో పబ్స్ దద్దరిల్లిపోయాయి.
గోవా.. గోవా.. గోవా..
New Year celebrations in Goa : గోవాలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని చాలా మంది కలలు కంటారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా అంచనాలకు మించి.. గోవాలో వేడుకలు జరిగాయి. హోటల్స్, రిసార్ట్స్, పబ్స్‌లో.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ బీచ్‌లలో ప్రజలు రాత్రిని గడిపారు.
ఇక కేరళ కొచ్చిలోని కొచ్చి ఫోర్ట్‌లో టపాసులు పేలాయి. దీప కాంతులతో న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు ప్రజలు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా.. ఒడిశా పూరీ తీరాన.. 8 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవైన జగన్నాథుడి సైకత శిల్పాన్ని వేశారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.
బెంగళూరులో లాఠీ ఛార్జ్..!
బెంగళూరు న్యూ ఇయర్ వేడుకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ప్రాంతంలో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో క్రౌడ్‌ను నియంత్రించేందుకు.. అక్కడి పోలీసులు ప్రజలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటన మినహా.. కర్ణాటక వ్యాప్తంగా.. నూతన ఏడాది సంబరాలు ప్రశాంతంగా జరిగాయి.
New Year celebrations in Hyderabad : ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో.. న్యూ ఇయర్ వేడుకలను మ్యూజిక్‌తో స్వాగతం పలికారు ప్రజలు. మ్యూజికల్ నైట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ఇళ్లల్లో.. ప్రజలు కేక్‌లు కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.
పూజలు.. అభిషేకాలు..
న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రజలు ఆదివారం తెల్లవారుజామున నుంచే వివిధ ఆలయాలకు తరలివెళుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నూతన ఏడాది తొలి రోజు సందర్భంగా.. ఉజ్జెయిన్ మహాకాళేశ్వర్ ఆలయంలో ‘భస్మారతి’ నిర్వహించారు.
ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో హారతి కార్యక్రమం జరిగింది.