తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2023 New Year Rangoli Ideas : న్యూ ఇయర్​ని ఈ ముగ్గులతో ఆహ్వానించేయండి..

2023 New Year Rangoli Ideas : న్యూ ఇయర్​ని ఈ ముగ్గులతో ఆహ్వానించేయండి..

31 December 2022, 10:13 IST

google News
    • 2023 New Year Rangoli Ideas : రంగోళి, ముగ్గులు అనేవి ప్రతి శుభకార్యాన్ని ప్రత్యేకం చేస్తాయి. అలా ముగ్గులు వేసి.. రెండు దీపాలు వెలిగిస్తే చాలు.. పండుగ శోభ ఇంటికి వచ్చేస్తుంది. 
 న్యూ ఇయర్ 2023 ముగ్గులు
న్యూ ఇయర్ 2023 ముగ్గులు

న్యూ ఇయర్ 2023 ముగ్గులు

2023 New Year Rangoli Ideas : పండుగలకు దుస్తులు, స్వీట్లు ఎంత కామనో.. ముగ్గులు కూడా అంతే కామన్. ఇవి పండుగ శోభను మరింత రెట్టింపు చేస్తాయి. న్యూ ఇయర్ అంటే మతాలకు అతీతంగా.. అందరూ కలిసి ఎంజాయ్ చేసే పండుగ. సాయంత్రం నుంచే అందరూ పార్టీలకు సిద్ధమవుతూ ఉంటారు. అమ్మలు, అమ్మాయిలు.. ఇంటి ముందు ముగ్గులు వేస్తూ.. న్యూ ఇయర్ పనులు ప్రారంభిస్తారు.

అయితే ఏ ముగ్గు వేసినా.. అది చూడడానికి ఆకట్టుకునేలా మీ ఫెస్టివ్ వైబ్​ని మరింత పెంచేదిలా ఉండాలని గుర్తించుకోండి.

  నెమలి ముగ్గు

ఏ పండుగకైనా సెట్ అయ్యే ముగ్గులు చాలానే ఉంటాయి. అలాంటి వాటిల్లో నెమలి ముగ్గులు ముందు ఉంటాయి. వీటిని వేసి.. దీపాలు వెలిగిస్తే చాలు.. పండుగ అంతా మీ లోగిలిలోనే ఉంటుంది.

రంగుల ముగ్గు

మీరు గచ్చుపై ముగ్గులు వేయాలని అనుకుంటే.. మార్కెట్లలో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తూ.. అందమైన డిజైన్లు వేయొచ్చు.

సింపుల్ ముగ్గులు

మీరు ముగ్గులు వేయాలి అనుకుంటే వాటికి ఎక్కువ సమయం కేటాయించకుండా.. ఎఫెక్టివ్​గా, సింపుల్​గా వేయగలిగే డిజైన్లను ఎంచుకోండి.

తోరణం ముగ్గు

ఈ తోరణం ముగ్గు వేయడం చాలా సింపుల్ అంతే కాకుండా దీనిని మీ ఇంటి ముందు వేస్తే.. పండుగ శోభ కచ్చితంగా మీదే అవుతుంది.

నెమలితో న్యూ ఇయర్

ఏ డిజైన్ వేసినా.. దానికి కచ్చితంగా మీ టచ్ ఇవ్వండి. అది అందరి ముగ్గులకంటే మీ ముగ్గు ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది.

పువ్వలతో, రంగులతో

ముగ్గులు కేవలం రంగులతోనే కాదు.. పిండికి రంగు వేసి.. ఉప్పుకి రంగు కలిపి.. ఇసుకతో ఇలా రకరకాల వాటితో.. మీరు ముగ్గులు వేయొచ్చు. న్యూ ఇయర్​కి వెల్​కమ్ చెప్పవచ్చు.

తదుపరి వ్యాసం