తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 Vrushaba Rasi Phalalu : 2023వ సంవత్సరం వృషభరాశి వారికి ఎలా ఉందంటే..

2023 Vrushaba Rasi Phalalu : 2023వ సంవత్సరం వృషభరాశి వారికి ఎలా ఉందంటే..

30 December 2022, 12:00 IST

    • 2023 Taurus Rasi Phalalu : ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి రాశి ఫలాలు బాగున్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 వృషభ రాశిఫలాలు ఇక్కడ చూడండి.
వృషభ రాశి
వృషభ రాశి

వృషభ రాశి

2023 Vrushaba Rasi Phalalu : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృషభరాశి వారికి అన్నీ అనుకూలమే అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వృషభరాశి వారికి 2023వ సంవత్సరంలో బృహస్పతి ఏప్రిల్ వరకు లాభస్థానమునందు తదుపరి వ్యయస్థానమునందు సంచరించుట చేత వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు అధికమవుతాయి. ధనపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తలు వహించడం మంచిది.

లేటెస్ట్ ఫోటోలు

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

వృషభరాశివారికి 2023 సంవత్సరంలో శని దశమ స్థానమునందు సంచరించుట వలన ఉద్యోగ వ్యాపారస్తులకు శుభ ఫలితాలు ఏర్పడును. వృషభరాశివారికి 2023వ సంవత్సరం ఏప్రిల్ వరకు శుభ ఫలితాలు మే నుంచి డిశంబరు వరకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభరాశి ఉ ద్యోగస్తులకు అన్ని విధాలుగా కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి లాభిస్తాయి. వృషభరాశి వ్యాపారస్తులకు వ్యాపారము మధ్యస్థముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. వృషభరాశి విద్యార్థులకు అనుకులమైనటువంటి సంవత్సరం. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి.

2023 సంవత్సరం వృషభరాశి వారికి కలసి వచ్చే సంవత్సరం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధన సంబంధిత విషయాలు లాభదాయకముగా ఉంటుంది. గత కొంతకాలముగా పరిష్కారము కాని సమస్యలు అన్నీ 2023లో పరిష్కరిమవుతాయి. వృషభరాశి వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణములు అనుకూలిస్తాయి. వృషభరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. 2023వ సంవత్సరంలో కుటుంబ వ్యవహారాలు, కుటుంబ విషయాల పట్ల.. కొంత చికాకులు కలుగుతాయి. మొత్తం మీద 2023 వృషభరాశి వారికి ధనపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూలముగా ఉంటుంది. వృషభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సోమవారం శివుని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి. వృషభరాశివారు వజ్రాన్ని ధరించడం వలన వారికి అనుకూలమైనటువంటి ఫలితములు పొందుతారు. ఆరు ముఖములు గల రుద్రాక్షను ధరించడం మంచిది అని వృషభరాశి వారికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
తదుపరి వ్యాసం