తెలుగు న్యూస్  /  Lifestyle  /  Results Are From 2022 April To 2023 March For Taurus Horoscope

Taurus Horoscope | వృషభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu

01 April 2022, 8:55 IST

    • వృషభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా వృషభరాశి రాశి గురించి తెలుసుకుందాం.
వృషభరాశి ఫలితాలు
వృషభరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

Ugadi Panchangam | కృత్తిక - 2,3,4 పాదములు, రోహిణి - 1,2,3,4 పాదములు, మృగశిర - 1,2 పాదములు

* ఆదాయం - 8

* వ్యయం - 8

* రాజ్యపూజ్యం -6

* అవమానం - 6

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి లాభ స్థానమునందు సంచరించుట, శని దశమ స్థానము, వక్రియై భాగ్య స్థానమునందు సంచరించుట, రాహువు వ్యయ రాశియగు 12వ స్థానమునందు సంచరించుట, కేతులు 6వ స్థానమునందు సంచరించుట చేత వృషభరాశివారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితములు ఉన్నవి. వృషభరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుటుంబమునందు సౌఖ్యము, కుటుంబంలో భేదాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ మీ మాట నెగ్గించుకొనుట, ధనవృద్ధి, కీర్తి కలుగును. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో శని వక్రియై భాగ్యమునందు సంచరించుటచేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితములు ఉండును. బృహస్పతి లాభములో సంచరించుట చేత అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండును. ఈ సంవత్సరం వృషభరాశివారికి ధనలాభము, కుటుంబ సౌఖ్యము, కీర్తి కలుగును. అపనిందలు, మానసిక ఆందోళనలు కలిగే సూచనలు ఉన్నవి.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>

వృషభరాశి వారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మధ్యస్థ ఫలితముగాను జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఉత్తమ ఫలితములుగాను ఉన్నవి. వృషభరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం మంచిగా ఉన్నప్పటికీ.. అదే స్థాయిలో ఖర్చులు పెరుగును. సమాజంలో కీర్తి పెరుగును. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసి వచ్చును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. స్త్రీలకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకముగా ఉండును. రైతులు, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితములు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే.. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించటం, గురువారం దత్తాత్రేయుని పూజించాలి.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వాహన సౌఖ్యం, ఆరోగ్యం, సుఖం పొందెదరు. గృహమునందు శుభకార్యములు జరుగును. కుటుంబ సౌఖ్యము మానసిక సౌఖ్యము, ఆనందకరమైనటువంటి భోజన సౌఖ్యం కలుగును.

మే - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఎదురుచూడని ఆపదలు, అనవసరపు వాదనలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు, ఊహించని కష్టములు కలుగును. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృత్తిపరంగా సంతృప్తి చెందుతారు.

జూన్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నవి. ఉదర సంబంధమైన ఇబ్బందులు, విపరీతమైన ఆలోచనలు. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. వస్త్ర, వాహన లాభములు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగును.

జూలై - ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. బంధువులకు దూరమవుతారు. కుటుంబంలో చికాకులు, అనవసరపు తగాదాలలో కల్పించుకోవద్దు. విజ్ఞతతో సమస్యలు పరిష్కరిస్తారు.

ఆగస్టు - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సోదరవర్గంలో సంతానపరంగా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలతో అనవసరపు ఖర్చులు. అధికారుల కోపానికి గురవుతారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగును.

సెప్టెంబర్ - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. శారీరక, మానసిక అలసట. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు. అనవసర ఖర్చులు, వస్తు, వాహన కొనుగోలు. ఆప్తులకు దూరంగా వుండవలసి వచ్చును.

అక్టోబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక అశాంతి, సంతానమునకు, తల్లిదండ్రులకు కష్టమైన కాలము. చెపట్టిన పనులు పూర్తి చేయలేరు. ధనవ్యయం, ధనాదాయం బాగుంటుంది. అపనిందలు బాధిస్తాయి.

నవంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.

డిసెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గత సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారంలో కలసిరాకపోవడం, ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పనుల్లో ఆటంకములు కలుగును.

జనవరి - ఈ మాసం నందు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సంతానమునకు చిక్కులు, అనుకోని ఖర్చులు పెరుగును. అధికారులతో గొడవలు, కంటికి సంబంధించిన వ్యాధులు కలుగును.

ఫిబ్రవరి - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక ఇబ్బందులు, ధనాదాయం తక్కువగా ఉండును. అధికారులతో, బంధుమిత్రులతో ఘర్షణలు. సంతానం కారణంగా సమస్యలు తీరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మార్చి - ఈ మాసం మీకు అని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనాదాయం బాగుంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దుష్ట స్త్రీ, పురుషలతో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవం కలుగును.

 

టాపిక్