తెలుగు న్యూస్  /  Lifestyle  /  Results Are From 2022 April To 2023 March For Aries Horoscope

Aries Horoscope | మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu

01 April 2022, 8:38 IST

    • మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మేషరాశి రాశి గురించి తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి

మేషరాశి

Ugadi Panchangam | అశ్విని - 1,2,3,4 పాదములు, భరణి -1,2,3,4 పాదములు, కృత్తిక - 1వ పాదము

ట్రెండింగ్ వార్తలు

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

* ఆదాయం-14

* వ్యయం-14

* రాజ్యపూజ్యం-3

* అవమానం-6

శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా బృహస్పతి వ్యయ స్థానమందు సంచరించుట, శని లాభ స్థానము, వక్రియై దశమ స్థానమునందు సంచరించుట, రాహువు జన్మ రాశియగు 1వ స్థానమందు సంచరించుట కేతువు సప్తమ స్థానమునందు సంచరించుట చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. మేషరాశివారికి రాహువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుటుంబమునందు కలహములు, కష్టములు అధికంగా ఉంటాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య శని వక్రియై ఉండుటచేత కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చికాకులు అధికంగా ఉంటాయి. బృహస్పతి వ్యయములో సంచరించుట చేత ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ సంవత్సరం స్థానమార్పు, ఇబ్బందులు కలిగే అవకాశముంది.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>

మేషరాశివారికి జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య అనుకూలమైన ఫలితములు లభిస్తాయి. ఈ సమయంలో ధనలాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, కుటుంబము నందు వ్యతిరేకత, ధన సంపాదనయందు నష్టము, ఖర్చు ఈ సంవత్సరములో అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. స్త్రీలకు ఇది మధ్యస్థ సమయం. కుటుంబంలో సమస్యలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. రాజకీయ నాయకులకు ఇది మధ్యస్థ కాలము. రైతులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేఘరాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే.. మంగళవారం రోజు విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, శనివారం రోజున రాహువు కాల సమయంలో దుర్గాదేవిని పూజించటం, గురువారం రోజున దత్తాత్రేయుని పూజించాలి.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ - ఈ మాసము అనుకూలంగా లేదు. గొడవలు, చికాకులు, అనవసరపు ప్రయాణాలు, ఖర్చులు, ఇబ్బందులు కలుగును. ధనాదాయం బాగుంటుంది.

మే - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. చాలా సమస్యలు కొలిక్కి వస్తాయి. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ఆర్థిక విషయాలు కొంత కుదుటపడతాయి.

జూన్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ధన వ్యయం అధికముగా ఉన్నది. వృత్తి వ్యాపారములందు అభివృద్ధి కలుగును.

జూలై - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. అన్నిటిలో విజయం. శారీరక సమస్యలు, దృష్టి కారణంగా చికాకులు. సోదరులకు, సంతానమునకు శుభఫలితములు. అనవసరపు ఖర్చులు.

ఆగస్టు - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతారు. దూరప్రాంతాల నుంచి అందవలసిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి,

సెప్టెంబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు కలగబోతున్నాయి. మానసిక ఇబ్బందులు, తల్లిదండ్రులకు అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నిందల పాలవుతారు. కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి.

అక్టోబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గతంలో బాధలు తొలగి వరుస విజయాలు సొంతమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి. అధికారులతో చికాకులు, నిందలు పడవలసివస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

నవంబర్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవాలు, ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. గృహమందు శుభకార్యములు, భూ, భవన లాభములు కలుగును. కుటుంబసభ్యుల మధ్య సర్దుబాటు జరుగును.

డిసెంబర్ - ఈ మాసం మీకు ఘర్షణలతో అంత అనుకూలంగా లేదు. అధికారులతో విరోధములు, సంతానమునకు ఇబ్బందులు, నిందలు పాలవుతారు. మానసిక, శారీరక సుఖములు పొందుదురు. ఆర్థికంగా అభివృద్ధి కలుగును.

జనవరి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు, ప్రయాణములయందు ప్రమాదములు. శారీరక, మానసిక ఇబ్బందులు కలుగును. ధననష్టం ఎక్కువగా ఉండును.

ఫిబ్రవరి - ఈ మాసం మీకు అద్భుతంగా ఉన్నది. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో సఖ్యంగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు.

మార్చి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలించును. శుభఫలితాలు పొందుతారు. ఖరీదైన విలాసవంతమైన జీవితం గడుపుతారు. అశాంతితో బాధపడతారు. ఇంట, బయట గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. చెపట్టిన పనులు విజయవతంగా పూర్తి చేస్తారు.

టాపిక్