తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 Tula Rasi Phalalu : 2023వ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందంటే..

2023 Tula Rasi Phalalu : 2023వ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందంటే..

31 December 2022, 9:00 IST

google News
    • 2023 Libra Rasi Phalalu : ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వారికి రాశి ఫలాలు బాగున్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023లో తులారాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి
తులారాశి

తులారాశి

2023 Tula Rasi Phalalu : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా తులారాశి వారికి 2023లో కలసివచ్చే సంవత్సరంగా ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023లో తులారాశి వారికి ఏప్రిల్ వరకు శని 4వ ఇంట, గురుడు 6వ ఇంట మే నుంచి డిసెంబర్ శని 5వ ఇంట గురుడు 7వ ఇంట సంచరిస్తున్నారు. తులారాశి వారికి 2023 ద్వితీయార్థము అనుకూలముగా ఉన్నది. తులారాశి వారికి జన్మరాశి యందు కేతువు, కళత్ర స్థానమునందు రాహువు సంచరించుటచేత మధ్యస్థ ఫలితములు ఏర్పడుచున్నవి. తులారాశివారికి 2023లో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత చేకూరును. తులారాశివారు ఆగ్రహ, ఆవేశాలను నియంత్రించుకొనుట మంచిది. కుటుంబ వ్యవహారాలయందు ఆచితూచి వ్యవహరించాలి.

2023లో తులారాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు, ధనలాభము, ప్రయోజనాలు పొందుతారు. తులారాశి వ్యాపారస్తులకు 2023 అన్ని విధాలుగా లాభదాయకముగా ఉంటుంది. 2023లో తులారాశి వారికి అర్ధాష్టమి శని పూర్తై శని పంచమ స్థానములో సంచరించుట వలన కొంతకాలముగా ఉన్న అనేక సమస్యలు కొలిక్కి వస్తాయి. తులారాశి విద్యార్థులకు 2023 కలసివచ్చును. ఈ రాశిలోని స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలి. ఈర్ష్య దర్పము వంటివి కలగకుండా చూసుకోవాలి. రైతులకు కలిసి వస్తుంది. సినీరంగం వారికి మధ్యస్థముగా ఉన్నది. మొత్తం మీద 2023 తులారాశి వారికి గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు కనపడుతున్నాయి.

మరింత శుభఫలితాలు పొందాలంటే.. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని సోత్రము పఠించడం శనివారం రోజు దుర్గా దేవిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి వారు వజ్రాన్ని ధరించడం మంచిది. తులారాశి వారు 6 ముఖములు గల రుద్రాక్షను ధరించడం వలన మరింత శుభ ఫలితములు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం