తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 Mithuna Rasi Phalalu : 2023వ సంవత్సరంలో మిధున రాశి వారి కష్టాలు తొలగిపోతాయట

2023 Mithuna Rasi Phalalu : 2023వ సంవత్సరంలో మిధున రాశి వారి కష్టాలు తొలగిపోతాయట

30 December 2022, 13:40 IST

    • 2023 Gemini Rasi Phalalu : ఆంగ్ల నూతన సంవత్సరంలో మిధున రాశి వారికి రాశి ఫలాలు బాగున్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 మిధున రాశి ఫలాలు ఇక్కడ చూడండి.
మిధున రాశి
మిధున రాశి

మిధున రాశి

2023 Mithuna Rasi Phalalu : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మిధునరాశి వారికి 2023లో కష్టాలు తొలగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023లో మిధున రాశి వారికి ఏప్రిల్ వరకు అష్టమ స్థానమునందు శని సంచరించడం, ఏప్రిల్ వరకు గురుడు దశమ స్థానమునందు తరువాత మే నుంచి లాభస్థానమునందు సంచరించుట చేత మిధున రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

మే 21, రేపటి రాశి ఫలాలు.. రేపు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు

May 20, 2024, 08:19 PM

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

మిధున రాశి వారు ఏప్రిల్ వరకు కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహరాల పట్ల జాగ్రత్త వహించండి. 2023 మే నుంచి మిధున రాశి వారికి కష్టములన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి 2023లో మే నుంచి డిశంబర్ మధ్య ఉన్న సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. 2023లో మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు, ధనలాభము వంటివి ఏర్పడుతాయి. మిధున రాశి వ్యాపారస్తులకు 2023 లాభదాయకముగా ఉంటుంది.

మిధున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. మిధున రాశి రైతాంగము వారికి 2023 లాభదాయకముగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య విషయములలో జాగ్రత్తలు వహించండి. కొంతకాలముగా ఉన్న సమస్యలనుంచి బయటకు వచ్చి విజయాన్ని పొందుతారు. 2023లో మిథున రాశివారు ఏప్రిల్ వరకు ఆరోగ్య విషయాల పట్ల కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్తలు వహించాలి. విదేశీ ప్రయాణములు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం ఆధ్యాత్మిక యాత్రలు శుభ ఫలితాలను కలుగిస్తాయి.

మిధున రాశి వారికి 2023లో మరింత శుభఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది. మిధున రాశివారు ఆకుపచ్చ ఉంగరం ధరించుకోవచ్చు. మిధున రాశివారు నాలుగు ముఖముల, ఐదు ముఖముల రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితములు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం