తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hurricane Ian: సౌత్ కరోలినాను ముంచెత్తిన హరికేన్

Hurricane Ian: సౌత్ కరోలినాను ముంచెత్తిన హరికేన్

HT Telugu Desk HT Telugu

01 October 2022, 7:04 IST

  • Hurricane Ian In South Carolina: హరికేన్ ఇయాన్ సౌత్ కరోలినా వీధులను ముంచెత్తింది. అమెరికాలో భారీ నష్టాలను మిగిల్చిన హరికేన్లలో ఇదొకటిగా నిలిచింది. గత వారం క్యూబాలో సైతం ఈ తుపాను విధ్వంసాన్ని మిగిల్చింది.

Hurricane Ian In South Carolina: తుపాను కారణంగా వీధుల్లో వరద నీరు
Hurricane Ian In South Carolina: తుపాను కారణంగా వీధుల్లో వరద నీరు (AP)

Hurricane Ian In South Carolina: తుపాను కారణంగా వీధుల్లో వరద నీరు

Hurricane Ian: హరికేషన్ ఇయాన్ శుక్రవారం తీర ప్రాంతంలోని సౌత్ కరోలినా వీధులను ముంచెత్తింది. ఈ తుపాను కారణంగా ఫ్లోరిడాలో 17 మంది చనిపోయినట్టు అసోసియేట్ ప్రెస్ నివేదించింది. గణనీయమైన నష్టాన్ని కలిగించిందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

అమెరికాను తాకిన అత్యంత ఖరీదైన హరికేన్లలో ఇది ఒకటిగా అంచనా వేస్తున్నారు. ఇది ఈ వారం కూడా క్యూబాలో విధ్వంసానికి కారణమైంది.

హరికేన్ ఇయాన్ చార్లెస్‌టన్‌లోని అనేక ప్రాంతాలను నీట ముంచింది. గార్డెన్ సిటీ పరిసరాల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరింది.

ఫ్లోరిడాలో ఈ హరికేన్ ఇళ్లను నేలమట్టం చేసింది. విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతిని 20 లక్షల మందికి విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.

ఇయాన్ హరికేన్ ‘100 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని కలిగించింది. .’ అని విపత్తు అంచనా సంస్థ కరెన్ క్లార్క్ అండ్ కంపెనీ తెలిపింది.

ప్రాణాలను రక్షించడానికి, ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం చేయడానికి సాధ్యమైన ప్రతి చర్యను తీసుకోవాలని నిర్దేశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. ‘దీని పునర్నిర్మాణానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది,..’ అని జో బిడెన్ వివరించారు.

మొన్న మంగళవారం క్యూబాను అతలాకుతలం చేసి, గంటల తరబడి విద్యుత్తు లేకుండా చేసిన హరికేన్ ఇయాన్ బుధవారం నుంచి ఫ్లోరిడాపై పడగ విప్పడంతో సముద్ర జలాలతో నిండిపోతూ అతలాకుతలమైంది.