Hurricane Ian drenches Florida: ఫ్లారిడాపై విరుచుకుపడిన హరికేన్ ఇయాన్-people trapped 2 5m without power as ian drenches florida ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hurricane Ian Drenches Florida: ఫ్లారిడాపై విరుచుకుపడిన హరికేన్ ఇయాన్

Hurricane Ian drenches Florida: ఫ్లారిడాపై విరుచుకుపడిన హరికేన్ ఇయాన్

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 04:17 PM IST

Hurricane Ian drenches Florida: అత్యంత తీవ్రమైన, శక్తిమంతమైన హరికేన్ అమెరికా రాష్ట్రం ఫ్లారిడాపై విరుచుకుపడింది. భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలులతో విధ్వంసం సృష్టిస్తోంది.

హరికేన్ ఇయాన్ విధ్వంసం
హరికేన్ ఇయాన్ విధ్వంసం

Hurricane Ian drenches Florida: ఈదురు గాలుల ధాటికి మనుషులే ఎగిరిపోతున్న దృశ్యాలు, రోడ్లపై షార్క్ లు కనిపిస్తున్న దృశ్యాలు.. హరికేన్ ఇయాన్ కారణంగా ఫ్లారిడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.

Hurricane Ian drenches Florida: రోడ్లపై షార్క్ లు..

అమెరికాలో వచ్చిన అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఒకటైన ఇయాన్ ఫ్లారిడాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లారిడా నైరుతీ ప్రాంతంలో బుధవారం తీరాన్ని దాటిన హరికేన్ ఇయాన్ మొత్తం ఆ రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తింది. నడుము లోతు నీళ్లలో షార్క్ లు ఈదుతున్న దృశ్యాలను, ఒక జర్నలిస్ట్ బలమైన గాలులకు కొట్టుకుపోతున్న దృశ్యాలను కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Hurricane Ian drenches Florida: కేటగిరీ 4 హరికేన్

ఈ హరికేన్ ఇయాన్ ను కేటగిరీ 4 తుపానుగా అధికారులు నిర్ధారించారు. ఈ తుపాను ధాటికి గంటకు 241 కిమీ ల వేగంతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఒక దశలో ఈ గాలులు తీర ప్రాంతంలో గంటకు 665 కిమీల వేగంతో వీచాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఫ్లారిడా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. తీవ్రమైన గాలుల ధాటికి ఒక ఆసుపత్రి పై కప్పు ఎగిరిపోయింది. చెట్లు పడిపోయాయి. ఫ్లారిడా తీరంలో 8 నుంచి 10 మీటర్ల ఎత్తులో అలలు తీర ప్రాంతంపైకి దూసుకువస్తున్నాయి.

Hurricane Ian drenches Florida: క్యూబాలో కూడా..

ఫ్లారిడాలో తీరం దాటే ముందు ఈ హరికేన్ క్యూబాను కూడా అస్తవ్యస్తం చేసి వచ్చింది. అక్కడి విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. ఈ తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. క్యూబా నుంచి వస్తున్న ఒక బోటు నీటిలో మునిగిపోవడంతో 20 మంది క్యూబన్ల గల్లంతయ్యారు.

Hurricane Ian drenches Florida: ఫ్లారిడాలో సహాయ చర్యలు

తుపాను తీవ్రరూపం దాల్చడంలో ఫ్లారిడాలో ప్రభుత్వం సహాయ చర్యలను ప్రారంభించింది. వైద్య సహాయం, తాగునీరు, ఆహారం అందించేందుకు అన్నీ సిద్ధం చేసింది. ఫ్లారిడా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు.

IPL_Entry_Point