Social media influencers : ఇన్ఫ్లుయెన్సర్లకు షాక్.. అమల్లోకి కొత్త రూల్స్- పాటించకపోతే ఇక అంతే!
21 January 2023, 7:14 IST
- New rules for Social media influencers : మీరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా? అయితే మీకు అలర్ట్! పలు కీలక మర్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా విధించనుంది.
ఇన్ఫ్లుయెన్సర్లకు షాక్.. కొత్త రూల్స్ పాటించకపోతే భారీ జరిమానా!
New rules for Social media influencers : ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్‌ను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్రాండ్ అసోసియేషన్‌పై డిస్క్లోజర్లు, కస్టమర్ల రక్షణ వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు సైతం తీసుకోవాలని నిర్ణయించింది కేంద్రం. రూ. 50లక్షల జరిమానాతో పాటు కనీసం 6 నెలల పాటు బ్రాండ్ల పబ్లిసిటీకి దూరంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొంది.
సోషల్ మీడియో ఇన్ఫ్లుయెన్స్లు పాటించాల్సిన రూల్స్..
అడ్వటైజర్- సెలబ్రెటీ/ ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య "మెటీరియల్ కనెక్షన్" ఉంటే.. అందుకు సంబంధించిన డిస్క్లోజర్ను కచ్చితంగా పబ్లీష్ చేయాలని సీసీపీఏ (సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) చీఫ్ నిధి ఖారే తెలిపారు.
Social media influencers new rules : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పలు నిబంధనలు తీసుకురావాలని.. గతేడాది సెప్టెంబర్ నుంచే ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. తాజాగా వాటిని అమలు చేసింది. ఈ సెక్టార్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటం ఇందుకు కారణం. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. దానిని ఉపయోగించుకుని.. తమ బ్రాండ్, ప్రొడక్టులను ప్రచారం చేసుకోవాలని వివిధ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2025 నాటికి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ రూ. 2,800కోట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి.
ఈ మార్గదర్శకాలు ఎవరికి వర్తిస్తాయంటే..
Social media influencers guidelines : ఆడియెన్స్ 'కొనుగోలు నిర్ణయాలను' ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని ఖారే తెలిపారు.
"ఎండోర్స్‌మెంట్‌కు సంబంధించిన డిస్క్లోజర్ చాలా స్పష్టంగా ఉండాలి. మిస్ అయ్యే ఛాన్సే లేకుండా డిస్క్లోజ్ చేయాలి. ఫొటోల్లో ఎండోర్స్మెంట్ చేయాలంటే.. ఆ ఇమేజ్‌పై డిస్క్లోజర్ను సూపర్ఇంపోజ్ చేయాలి. వీడియోలో అయితే.. కేవలం డిస్క్రిప్షన్లో పెట్టి వదిలేయకూడదు. వీడియోలోనూ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లైవ్‌స్ట్రీమ్‌లో అయితే.. టిక్కర్ రూపంలో ఎప్పుడూ డిస్క్లోజ్ చేస్తూనే ఉండాలి. లైవ్‌స్ట్రీమ్ అయ్యేంత వరకు టిక్కర్ ఉండాల్సిందే," అని ఖారే స్పష్టం చేశారు.
ఇవన్నీ.. మెటీరియల్ కనెక్షన్లే..!
Social media influencers impact on youth : "మెటీరియల్ కనెక్షన్ అంటే.. డైరక్ట్‌గా లబ్ధిపొందటం ఒక్కటే కాదు. మొనేటరీ, ఇతర కాంపెన్సేషన్లు కూడా ఇందులోకి వస్తాయి. ప్రొడక్టులు ఫ్రీగా ఇవ్వడం లేదా కండీషన్లు లేకుండా ఇవ్వడం కూడా మెటీరియల్ కనెక్షన్ కిందకే వస్తుంది. ట్రిప్స్, హోటల్ స్టే, మీడియా బార్టర్స్, కవరేజ్, అవార్డ్లు, ఫ్యామిలీ-పర్శనల్ ఎంప్లాయిమెంట్ రిలేషన్షిప్ వంటివి కూడా ఈ జాబితాలోకి వస్తాయి," అని ఖారే తెలిపారు. ఈ మార్గదర్శకాలను.. 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో భాగంగా జారీ చేసినట్టు వివరించారు.
పర్సనల్ కేర్, క్లోథింగ్ సెగ్మెంట్లపై ఈ నిబంధనల ప్రభావం భారీగా పడనుందని కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తూన్న బ్రాండ్స్‌లో అత్యధిక వాటే ఈ సెగ్మెంట్లదే అని పేర్కొన్నారు. "ఇన్ఫ్లుయెన్సర్లు.. డబ్బులు తీసుకుని బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారా? లేదా? అన్న విషయం వీక్షకులకు కచ్చితంగా తెలియాలి. అప్పుడే వారి కొనుగోలు నిర్ణయాలు మార్చుకోవచ్చు," అని ఆయన తెలిపారు.
Social media influencers : ఈ నిబంధనలను ఉల్లంఘించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ నిబంధనలు రూపొందించింది ప్రభుత్వం. తప్పుదోవ పట్టించే విధంగా యాడ్స్ ఉంటే.. మరింత కఠిన శిక్షలు అమలవుతాయి!