తెలుగు న్యూస్  /  National International  /  Viral Video Show Shopkeeper In Noida Beaten Up For Refusing To Replace Jacket

Noida viral video : జాకెట్​ ‘ఎక్స్​ఛేంజ్’​కు ఒప్పుకోలేదని.. దుకాణదారుడిపై దాడి!

15 January 2023, 7:29 IST

    • Noida crime news : కొన్న వస్తువు ఎక్స్​ఛేంజ్​కు ఒప్పుకోలేదన్న కారణంతో దుకాణదారుడిపై ఇద్దరు దాడి చేసిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
 జాకెట్​ ఎక్స్​ఛేంజ్​కు ఒప్పుకోలేదని.. దుకాణదారుడిపై దాడి!
జాకెట్​ ఎక్స్​ఛేంజ్​కు ఒప్పుకోలేదని.. దుకాణదారుడిపై దాడి!

జాకెట్​ ఎక్స్​ఛేంజ్​కు ఒప్పుకోలేదని.. దుకాణదారుడిపై దాడి!

Noida crime news : నోయిడాలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. జాకెట్​ ఎక్స్​ఛేంజ్​కు ఒప్పుకోలేదన్న కారణంతో.. ఓ దుకాణదారుడిపై కర్రతో దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

అసలేం జరిగిందంటే..

ఓ మహిళ.. నోయిడా మార్కెట్​లోని ఓ దుకాణం నుంచి కొన్ని రోజుల క్రింత ఓ జాకెట్​ కొనుగోలు చేసింది. దానిని రిటర్న్​ ఇచ్చేందుకు గురువారం ఆ దుకాణానికి వెళ్లింది. ఎక్స్​ఛేంజ్​ చేసేందుకు దుకాణదారుడు అంగీకరించలేదు. వెంటనే ఆ మహిళ.. ఆమె భర్తకు ఫోన్​ చేసి జరిగిన విషయం చెప్పింది.

Attack on Noida shopkeeper : మహిళ భర్త.. మరో వ్యక్తితో పాటు దుకాణం వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి రెండు కర్రలతో దుకాణ యజమానిని కొట్టడం మొదలుపెట్టారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

తొలుత.. దుకాణ యజమాని కస్టమర్లతో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. సడెన్​గా ఓ వ్యక్తి అతనిపై కర్రతో దాడి చేశాడు! ఇతను ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. కర్రతో బలంగా కొట్టడం మొదలుపెట్టారు. ఓ సందర్భంలో కర్ర కూడా విరిగిపోయింది! ఈ పరిణామాలతో కస్టమర్లు షాక్​కు గురయ్యారు.

Noida crime news : మరో వ్యక్తి కూడా దుకాణదారుడిని కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి.. మరో వ్యక్తి వచ్చి.. దాడి చేస్తున్న ఇద్దరిని అడ్డుకుని నచ్చజెప్పినట్టు వీడియోలో కనిపిస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్​ చేశారు. మరొకరిని పట్టుకునే పనిలో ఉన్నారు. మరోవైపు బాధితుడికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అతడిని ఆసుపత్రికి తరలించారు.

"బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించాము. మెడికల్​ రిపోర్టు, సీసీటీవీ ఫుటేజ్​లను సాక్షాలుగా పనికొస్తాయి. ఒక నిందితుడిని అరెస్ట్​ చేశాము," అని నోయిడా ఏడీసీపీ ఆషుతోష్​ ద్వివేది వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :