తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video: నదిలో నయా బిజినెస్..! భక్తుల తరఫున ఒక్కో మునకకు రూ.10

Viral Video: నదిలో నయా బిజినెస్..! భక్తుల తరఫున ఒక్కో మునకకు రూ.10

27 December 2022, 20:07 IST

    • Viral Video: చల్లటి నది నీటిలో భక్తుల తరఫున మునక వేస్తానంటూ ఓ వ్యక్తి వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Viral Video: నదిలో నయా బిజినెస్..! భక్తుల తరఫున ఒక్కో మునకకు రూ.10 (Photo: Twitter)
Viral Video: నదిలో నయా బిజినెస్..! భక్తుల తరఫున ఒక్కో మునకకు రూ.10 (Photo: Twitter)

Viral Video: నదిలో నయా బిజినెస్..! భక్తుల తరఫున ఒక్కో మునకకు రూ.10 (Photo: Twitter)

Viral Video: ప్రస్తుత కాలంలో కొందరు సరికొత్త ఐడియాలతో వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరికీ రాని విభిన్నమైన ఐడియాలతో మరికొందరు బిజినెస్ మొదలుపెడుతున్నారు. మెదడులో ఉండే ఆలోచనలను ఆచరణలోకి తెస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పేది మాత్రం ఏ స్టార్టప్ కంపెనీ గురించో కాదు. చలికాలంలో ఓ వ్యక్తికి వచ్చిన బిజినెస్ ఐడియా గురించి. శీతాకాలంలో చల్లటి నీరు ఉండే నదిలో మునక వేసేందుకు చార్జీలను వసూలు చేస్తున్నారు ఆ వ్యక్తి. భక్తుల తరఫున నదిలో మునకలేసే (Holy Dip) బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతడి ఐడియాకు చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

నీరు చల్లగా ఉన్న నదిలో భక్తుల తరఫున మునకలు (పుణ్య స్నానం) వేసే బిజినెస్ చేస్తున్న ఆ వ్యక్తి ఐడియా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐఏఎస్ అవనీశ్ శరణ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “ఈ సీజన్‍లో ఇది బెస్ట్ స్టార్టప్” అని హిందీలో రాసుకొచ్చారు. ఆ తర్వాత ఇది వైరల్‍గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఒక్కో మునకకు రూ.10

Viral Video: ఓ వ్యక్తి.. షార్ట్ ధరించి నది మధ్యలో ఉండే రెయిలింగ్‍పై కూర్చున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. తమ తరఫున నదిలో మునగాలంటే ఒక్కో మునకకు రూ.10 ఇవ్వండి అని ఆ వ్యక్తి.. అక్కడికి వచ్చిన భక్తులతో హిందీలో అన్నారు. “ఇంతటి చల్లని వాతావరణంలో మీ తరఫున నేను నదిలో మునకలు వేస్తాను. మీరు చెబుతూ మునుగుతాను. దీంతో మీకు ప్రతిఫలం దక్కుతుంది. నాకు రూ.10వస్తాయి” అని ఆ వ్యక్తి.. భక్తులను పిలుస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. కాగా, ఇది ఏ ప్రాంతంలో జరిగిందో స్పష్టత లేదు.

ఈ వీడియో కొన్ని రోజుల ముందు ట్విట్టర్‌లో పోస్ట్ కాగా.. విపరీతంగా వైరల్ అవుతోంది. వేలాది లైక్‍లు, కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోకు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆన్‍లైన్ పేమెంట్ సదుపాయం కూడా కల్పించాలని, ఇంట్లో ఉండే తమ పేరుపై కూడా మునకలేయాలని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. బెస్ట్ ఇన్నోవేషన్ అని చాలా మంది రాసుకొచ్చారు. ఇండియాలో మాత్రమే ఇలా జరుగుతుందని అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

తదుపరి వ్యాసం