తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Rate: భారీగా పడిపోయిన బంగారం, వెండి.. మీ నగరంలోని తాజా ధరలివే

Gold Rate: భారీగా పడిపోయిన బంగారం, వెండి.. మీ నగరంలోని తాజా ధరలివే

HT Telugu Desk HT Telugu

12 May 2022, 6:46 IST

    • కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే ఓరోజు తగ్గటం.. మరోరోజు పెరగుతుండటంతో ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే మరోసారి బంగారం ధర పతనమైంది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,000గా ఉంది.
బంగారం వెండి ధరలు
బంగారం వెండి ధరలు

బంగారం వెండి ధరలు

gold and silver price: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. నిన్నటితో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా బంగారం ధర రూ. 350 తగ్గింది. ఫలితంగా ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,000గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 వద్ద కొనసాగుతోంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు కిలోకు రూ.1500 తగ్గి.. రూ.64,800 అయింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,750గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,000గా నమోదైంది.ఇక్కడ వెండి ధర కిలో రూ. 64,800 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

పలు నగరాల్లో…

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,870గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,220గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

 

టాపిక్