తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adani Group Crisis : ‘ఆదానీ’ సంక్షోభంపై అట్టుడికిన పార్లమెంటు

Adani Group crisis : ‘ఆదానీ’ సంక్షోభంపై అట్టుడికిన పార్లమెంటు

HT Telugu Desk HT Telugu

02 February 2023, 17:19 IST

  • Adani Group crisis : ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ (Gautam Adani) కి చెందిన ఆదానీ గ్రూప్ (Adani group) ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ బృందం(JPC)తో విచారణ జరపాలని గురువారం పార్లమెంట్లో విపక్షం డిమాండ్ చేసింది.

పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద విపక్ష నేతలు
పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద విపక్ష నేతలు

పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద విపక్ష నేతలు

Adani Group crisis : హిండెన్ బర్గ్ (Hindenburg) రీసెర్చ్ విడుదల చేసిన ఆదానీ గ్రూప్ (Adani group) ఆర్థిక అవకతవకల నివేదికపై పార్లమెంట్లో గందరగోళం కొనసాగింది. ఆ ఆరోపణలపై పూర్తి స్థాయి, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Adani Group crisis : హిండెన్ బర్గ్ (Hindenburg) నివేదిక వెలువడిన నాటినుంచి ఆదానీ గ్రూప్ (Adani group) షేర్ల విలువ దారుణంగా పడిపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం భారత దేశంలో సంచలనంగా మారింది. వేరే ప్రయోజనాలను ఆశించి, తప్పుడు సమాచారంతో ఈ నివేదికను రూపొందించారని ఆదానీ గ్రూప్ (Adani group) చైర్మన్ గౌతమ్ ఆదానీ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.

Adani Group crisis : జేపీసీతో దర్యాప్తు జరపాలి

ఆదానీ గ్రూప్ (Adani group) పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee JPC) తో కానీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ దర్యాప్తు జరపాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా వెల్లడించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఆదానీ గ్రూప్ (Adani group) కంపెనీల్లో ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులతో బలవంతంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించడం వెనుక భారీ కుట్ర ఉందని ఖర్గే ఆరోపించారు.

Adani Group crisis : జనవరి 24న..

ఆదానీ గ్రూప్ (Adani group) స్టాక్ మానిప్యులేషన్స్ పై, ఆదానీ కంపెనీలకు ఉన్న భారీ అప్పులపై, ఏడు లిస్టెడ్ ఆదానీ కంపెనీల ఓవర్ వ్యాల్యుయేషన్ పై, ఆఫ్ షోర్ టాక్స్ హెవెన్స్ లో ఆదానీ గ్రూప్ లావాదేవీలపై సవివర నివేదికను హిండెన్ బర్గ్ (Hindenburg) జనవరి 24న విడుదల చేసింది. ఆ నివేదక భారత దేశ వ్యాపార, రాజకీయ, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెను దుమారం రేపింది. ఆదానీ గ్రూప్ అక్రమాలపై, ఎల్ఐసీ (LIC), ఎస్బీఐ (SBI), ఇతర నేషనలైజ్డ్ బ్యాంకుల ద్వారా ఆదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడంపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఖర్గే కోరారు.

టాపిక్