తెలుగు న్యూస్  /  National International  /  Civil Aviation Ministry To Probe If Punjab Cm Bhagwant Mann Got Drunk And Boarded Flight In Frankfurt

Bhagwant Mann Frankfurt : భగవంత్​ మాన్​.. నిజంగానే మద్యం సేవించి విమానం ఎక్కారా?

Sharath Chitturi HT Telugu

20 September 2022, 13:49 IST

    • Bhagwant Mann Frankfurt : మద్యం మత్తులో ఉన్న పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​ను జర్మనీ విమానంలో నుంచి దింపేశారన్న వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పుడు ఈ విషయంపై విమానయానశాఖ దర్యాప్తు చేపట్టనుంది.
భగవంత్​ మాన్​
భగవంత్​ మాన్​ (HT_PRINT)

భగవంత్​ మాన్​

Bhagwant Mann Germany : పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​.. నిజంగానే మద్యం సేవించి జర్మనీలో విమానం ఎక్కారా? ఆమ్​ ఆద్మీ పార్టీని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు భారత విమానయాన శాఖ సిద్ధపడింది.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

భగవంత్​ మాన్​ జర్మనీ పర్యటన..

పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​.. 8 రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. అది ముగించుకుని ఆదివారమే ఇండియాకి తిరిగొచ్చారు. అయితే.. ఆయన జర్నీ చేసిన లుప్థాన్స విమానం ఆలస్యంగా ఇండియాకి వచ్చింది.

Bhagwant Mann Lufthansa : ఈ నేపథ్యంలో విపక్ష శిరోమణి అకాలీదళ్​.. భగవంత్​ మాన్​పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. 'మద్యం మత్తులో.. కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్​ సీఎంను ఫ్రాంక్​​ఫర్ట్​లో విమానం నుంచి దింపేశారు. ఇది పంజాబ్​ ప్రజలకు సిగ్గు చేటు,' అంటూ ఆరోపించింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు.. తమకు ఈ విషయాన్ని చెప్పినట్టు వివరించింది.

విపక్షాల ఆరోపణలను ఆప్​ తిప్పికొట్టింది. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి భగవంత మాన్​ విదేశాలకు వెళితే.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడింది. కాగా.. ఈ వ్యవహారంపై భగవంత మాన్​, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​లు ఇంకా స్పందించలేదు.

Bhagwant Mann news : మరోవైపు ఈ వ్యవహారంపై సంబంధిత విమానయాన సంస్థ స్పందించింది. విమానాల మార్పు కారణంగానే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది.

ఇక ఈ విషయంపై విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు.

"ఇది విదేశాల్లో జరిగింది. అందువల్ల ఇది నిజమో కాదో తెలుసుకుంటాము. డేటా మాత్రం లుఫ్థాన్స ఇవ్వాలి. నాకు అందిన ఫిర్యాదుల మేరకు నేను విచారణ జరుపుతాను," అని జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు.