తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Free Electricity: 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు: గుజరాత్‌‌లో కేజ్రీ బంపర్ ఆఫర్

Free electricity: 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు: గుజరాత్‌‌లో కేజ్రీ బంపర్ ఆఫర్

HT Telugu Desk HT Telugu

21 July 2022, 18:50 IST

    • రానున్న ఎన్నికల్లో గెలిస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.
సూరత్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
సూరత్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (PTI)

సూరత్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

సూరత్, జూలై 21: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాము గెలిస్తే గృహ వినియోగదారులందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, గుజరాత్‌లోని నగరాలు, గ్రామాలకు 24 గంటలపాటూ విద్యుత్తు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన సూరత్‌లో విలేకరుల సమావేశంలో తొలి హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Israel-Hamas war: ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్; నెగ్గిన ప్రతిపాదన

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31, 2021 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

‘గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. అన్ని నగరాలు, గ్రామాలలో 24 గంటల విద్యుత్ సరఫరాను మేం నిర్ధారిస్తాం. 2021 డిసెంబర్ 31 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తాం..’ అని చెప్పారు.

మంత్రులకు విద్యుత్తు ఉచితంగా ఇచ్చినప్పుడు ప్రజలకు ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు.

ఉచిత కరెంటును వ్యతిరేకిస్తున్న బీజేపీని విమర్శిస్తూ.. ‘బీజేపీ నేతలు ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఉచిత కరెంటు వద్దు అనేవాళ్లు రాతపూర్వకంగా ఇస్తే నేను వారికి ఉచిత విద్యుత్తు ఇవ్వను..’ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికలకు ముందు చాలా పార్టీలు హామీలు ఇస్తుంటాయని, రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన వారు ఎన్నికల తర్వాత మాయ చేశారని అన్నారు.

గుజరాత్‌లో 27 ఏళ్లుగా బిజెపి ప్రభుత్వంతో విసిగిపోయిన గుజరాత్ ప్రజలు తమకు మద్దతుగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని గతంలోనే పార్టీ ప్రకటించింది.

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత, ఆప్ ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో ఆ పార్టీ అరంగేట్రం చేసినా ఖాతా తెరవలేకపోయింది.

ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2021 సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో బిజెపి 93 స్థానాలను గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ సూరత్ మున్సిపల్‌లో 27 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆప్ గుజరాత్‌పై ఆశలు పెంచుకుంది.

తదుపరి వ్యాసం