తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Prajwal Revanna Case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

Sharath Chitturi HT Telugu

11 May 2024, 8:50 IST

google News
    • Devaraje Gowda arrest : ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ కేసు నేపథ్యంలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు దేవరాజ్​ గౌడ. ఈ బీజేపీ నేతని పోలీసులు తాజాగా అరెస్ట్​ చేశారు. మరో మహిళపై లైంగిక దాడి ఆరోపణలు ఇందుకు కారణం!
ప్రజ్వల్​ రేవన్న..
ప్రజ్వల్​ రేవన్న.. (PTI)

ప్రజ్వల్​ రేవన్న..

Prajwal Revanna videos : ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ కుంభకోణం కేసు మధ్యలో.. బీజేపీ నేత, న్యాయవాది జీ దేవరాజ్​ గౌడను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. చిత్రదుర్గ్​లోని గులిహాల్​ టోల్​ గేట్​ వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తనపై దేవరాజ్​ గౌడ లైంగిక దాడి చేశారని ఓ మహిళ ఆరోపించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

ప్రజ్వల్​ రేవన్న కేసు- దేవరాజ్​ గౌడ అరెస్ట్​..

దేవరాజ్​ గౌడపై సెక్షన్​ 354, 354సీ, 448, 504, 506, 2008 ఐటీ చట్టం ఐపీఎస్​ సెక్షన్​ 34, 66ఈ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళపై లైంగిక దాడి, ఇంట్లోకి చొరబడటం, కావాలనే పరువు తీయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, నేరపూరిత సాన్నిహిత్యం వంటివి ఆయనపై వేసిన సెక్షన్లు.

హసన్​లోని హాలేనరసిపుర ప్రాంతంలోని తన ఇంట్లో, ఫిబ్రవరి 4న గౌడ తనపై లైంగిక దాడి చేశారని ఏప్రిల్​ 1న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి. మరి.. ఏప్రిల్​లో ఎఫ్​ఐఆర్​ నమోదైతే.. ఇప్పటివరకు ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్​ చేయలేదో తెలియరాలేదు.

అయితే.. తనపై వచ్చిన ఆరోపణలను కర్ణాటక బీజేపీ నేత దేవరాజ్​ గౌడ ఖండించారు.

Devaraje Gowda arrested : కర్ణాటకలో భగ్గుమున్న జేడీఎస్​ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ కుంభకోణం కేసు సమయం నుంచి దేవరాజ్​ గౌడ పేరు బాగా వినిపిస్తోంది. మహిళలపై ప్రజ్వల్​ రేవన్న నేరాలను గతేడాది డిసెంబర్​లో బీజేపీకి వివరించానని గౌడ చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్​కి కూడా లేఖ రాసినట్టు వివరించారు. కానీ తన మాట వినకుండా.. జేడీఎస్​తో బీజేపీ పొత్తు పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అయితే.. దేవరాజ్​ గౌడ ఎవరికి ఫిర్యాదు చేయలేదని.. కర్ణాటక బీజేపీ నాయకత్వం చెబుతోంది.

అంతేకాదు.. ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ వీడియోలను లీక్​ చేశారని దేవరాజ్​ గౌడపై ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక.. ఇండియాను విడిచి వెళ్లిపోయిన ప్రజ్వల్​ రేవన్న కేసును సిట్​ బృందం దర్యాప్తు చేస్తోంది. తమ ముందు హాజరవ్వాలని.. దేవరాజ్​ గౌడను ఆదేశించింది.

Devaraje Gowda Prajwal Revanna : ప్రజ్వల్​ రేవన్న ప్రస్తుతం హసన్​ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ- జేడీఎస్​ పొత్తు కుదుర్చుకున్న అనంతరం.. ఆయన మళ్లీ అదే సీటు నుంచి పోటీ చేశారు. కానీ పోలింగ్​కి ఒక రోజు ముందు.. ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ వీడియోలకు సంబంధించిన పెన్​ డ్రైవ్​లు.. హసన్​లోని అనేక ప్రాంతాల్లో కనిపించాయి. అప్పటి నుంచి ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

తదుపరి వ్యాసం