తెలుగు న్యూస్  /  National International  /  China Building Dam Near Border With India, Nepal, New Satellite Images Shows

India China border : భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా 'డ్యామ్​'!

20 January 2023, 7:39 IST

  • India China border : భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఓ డ్యామ్​ నిర్మిస్తోంది చైనా. ఇది భారత దేశ నీటి భద్రతకు ముప్పు కలిగేంచే విషయం అని నిపుణులు చెబుతున్నారు.

భారత సరహద్దుకు అత్యంత సమీపంలో చైనా 'డ్యామ్​'!
భారత సరహద్దుకు అత్యంత సమీపంలో చైనా 'డ్యామ్​'!

భారత సరహద్దుకు అత్యంత సమీపంలో చైనా 'డ్యామ్​'!

China dam near India border : భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్​​ సరిహద్దుల్లో ఓ డ్యామ్​ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

డ్యామ్​.. ఎందుకు- ఎక్కడ?

టిబెట్​లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్​తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్​కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్​లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది ఇండియాలోని గంగా నదిలో చేరిపోతుంది.

India China border : కాగా.. ఈ ట్రై జంక్షన్​కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చైనా ఓ డ్యామ్​ను నిర్మిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను.. ఇంటెల్​ ల్యాబ్​కు చెందిన జియోస్పాటియల్​ ఇంటెలిజెన్స్​ రీసెర్చర్​ డామియన్​ సిమాన్​ విడుదల చేశారు. 2021 మే నుంచి ఈ డ్యామ్​కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు ఆయన వివరించారు. డ్యామ్​తో నది కదలికలను నియంత్రించేందుకు చైనా భావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. డ్యామ్​ పొడవు 350ఎంఎం- 400ఎంఎం మధ్యలో ఉండొచ్చు. "ప్రస్తుతం ఈ డ్యామ్​ నిర్మాణ దశలోనే ఉంది. మరి దీనిని చైనా ఎలా ఉపయోగిస్తుందనేది స్పష్టంగా తెలియదు. ఈ డ్యామ్​కు సమీపంలో ఓ ఎయిర్​పోర్ట్​ను కూడా చైనా కడుతోంది!" అని డామియన్​ సిమాన్​ తెలిపారు.

భారత దేశ నీటి భద్రతకు ముప్పు..!

India China border dispute : మబ్జా జాంగ్బో నది నుంచి దిగువకు వస్తున్న నీరును నియంత్రించి, నిల్వచేసేందుకు ఈ డ్యామ్​ను చైనా వినియోగిస్తుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డారు. నీరు ఒకేసారి విడుదల చేస్తే.. దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.

మౌలికవసతుల పేరుతో.. సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో చైనా వివిధ కార్యకలాపాలను చేపడుతుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. టిబెట్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి, యర్లూంగ్​ జాంగ్బో నదిపై ఓ 'సూపర్​' డ్యామ్​ను నిర్మిస్తామని చైనా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉపగ్రహ చిత్రలు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యర్లూంగ్​ జాంగ్బో నది.. అరుణాచల్​ ప్రదేశ్​లోకి ప్రవహించి సియాంగ్​గా పేరు మార్చుకుంటుంది. అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నదిగా అసోంలోకి వెళుతుంది.

India China relations : చైనా కడుతున్న డ్యామ్​లు ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో ఆందోళన రేకెతిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. 2020 మేలో చైనా- భారత్​ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటి నుంచి ఇవి మరింత తీవ్రంగా మారాయి. సరిహద్దుల్లో మౌలికవసతుల పేరుతో ఎయిర్​పోర్టులు, మిసైల్​- డిఫెన్స్​ శిబిరాలు వంటి ఏర్పాట్లు చేసుకుంటోంది.

India China latest news : ఇక తాజా డ్యామ్​ వార్తలతో చైనా దురుద్దేశం మరోమారు స్పష్టమైందని పేర్కొన్నారు ఓఆర్​ఎఫ్​(అబ్సర్వర్​ రీసెర్ఛ్​ ఫౌండేషన్​)కు చెందిన సమీర్​ పాటిల్​. "ఈ డ్యామ్​.. భారత దేశ నీటి భద్రతకు ముప్పు కలిగించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పనులతో.. ఇప్పటికే బలహీనంగా ఉన్న బంధాన్ని, మరింత ఉద్రిక్తంగా మార్చుకుంటోంది చైనా," అని అన్నారు.