India China border : చైనాతో సరిహద్దు వివాదంపై జైశంకర్​ సంచలన వ్యాఖ్యలు!-on the northern borders china is seeking to change the status quo says jaishankar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  On The Northern Borders, China Is Seeking To Change The Status Quo: Says Jaishankar

India China border : చైనాతో సరిహద్దు వివాదంపై జైశంకర్​ సంచలన వ్యాఖ్యలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 15, 2023 09:16 AM IST

Jaishankar on India China border dispute : భారత్​ చైనా సరిహద్దు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు జైశంకర్​. ఉత్తర సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు.

చైనాతో సరిహద్దు వివాదం.. జైశంకర్​ సంచలన వ్యాఖ్యలు!
చైనాతో సరిహద్దు వివాదం.. జైశంకర్​ సంచలన వ్యాఖ్యలు! (HT_PRINT)

Jaishankar on India China border dispute : భారత దేశ ఉత్తర సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​. భారత్​తో కుదుర్చున్న ఒప్పందానికి వ్యతిరేకంగా.. సరిహద్దుల్లో భారీ స్థాయిలో దళాలను చైనా మోహరిస్తోందని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

‘ఒప్పందాన్ని లెక్కచేయని చైనా!’

తమిళనాడు చెన్నైలో శనివారం జరిగిన ఓ ఈవెంట్​లో పాల్గొన్నారు జైశంకర్​. ఈ క్రమంలోనే చైనా, సరిహద్దు వివాదం వంటి అంశాలపై మాట్లాడారు.

India China border dispute : "ఉత్తర సరిహద్దుల్లో భారీ స్థాయిలో దళాలను చైనా మోహరిస్తోంది. ఫలితంగా సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది భారత్​తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధం. కొవిడ్​ సంక్షోభంలోనూ.. 2020 మేలో ఇదే జరిగింది. కానీ చైనా చర్యలను భారత్​ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొడుతోంది," అని జైశంకర్​ స్పష్టం చేశారు.

సరిహద్దుల్లో భారత్​ మోహరించిన దళాలు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయని, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నైనా ఎదుర్కొంటూ విధి నిర్వహణలో పాల్గొంటున్నాయని తెలిపారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​.

India China relations : "జాతీయ భద్రత విషయంలో భారత్​ తలొగ్గదని.. చైనాతో జరిగిన పరిణామాలను చూసి ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నాయి. అందుకే ప్రపంచ వేదికపై భారత్​కు గౌరవం, గుర్తింపు లభిస్తోంది," అని జైశంకర్​ అన్నారు.

సరిహద్దు వివాదం నేపథ్యంలో.. చైనాపై జైశంకర్​ ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా కుట్ర పన్నుతోందని.. గతంలోనూ కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు విదేశాంగశాఖ మంత్రి.

India China border clash : "ఏకపక్ష ధోరణితో ఎల్​ఏసీని మార్చకూడదని చైనా- భారత్​ మధ్య ఒప్పందం ఉంది. కానీ సరిహద్దుల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి," అని ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియన్​ జేఐబీ2 పాడ్​క్యాస్ట్​లో తెలిపారు జైశంకర్​.

సరిహద్దుల్లో అలజడులు..

భారత్​- చైనాల మధ్య 2020 నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా 2020 జూన్​లో జరిగిన గల్వాన్​ ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. అప్పటి నుంచి.. ఇరు దేశాల ఉన్నతాధికారులు.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. శాంతి కొనసాగుతున్నప్పటికీ.. పూర్తిస్థాయి పరిష్కారమైతే లభించలేదు. ఈ క్రమంలోనే గత నెలలో అరుణాచల్​ప్రదేశ్​లో భారత్​- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినట్టు వచ్చిన వార్తలం సంచలనంగా మారాయి. సరిహద్దును దాటి వచ్చిన చైనా సైనికులను భారత దళం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఓ ప్రకటనలో తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం