తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  China Covid Deaths : నెల రోజుల్లో 60వేల మరణాలు.. కొవిడ్​తో చైనా విలవిల!

China covid deaths : నెల రోజుల్లో 60వేల మరణాలు.. కొవిడ్​తో చైనా విలవిల!

15 January 2023, 8:20 IST

China covid deaths : చైనాలో ఇటీవలే కొవిడ్​ సృష్టించిన అలజడులకు నిదర్శనంగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. కొవిడ్​ కారణంగా నెల రోజుల వ్యవధిలో చైనావ్యాప్తంగా దాదాపు 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు! ఈ విషయాన్ని స్వయంగా చైనానే వెల్లడించింది. కొవిడ్​ కేసులు, మరణాల డేటాలో చైనా పారదర్శకంగా ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా విడుదల చేసిన డేటాకు ప్రాధాన్యత సంతరించుకుంది.

  • China covid deaths : చైనాలో ఇటీవలే కొవిడ్​ సృష్టించిన అలజడులకు నిదర్శనంగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. కొవిడ్​ కారణంగా నెల రోజుల వ్యవధిలో చైనావ్యాప్తంగా దాదాపు 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు! ఈ విషయాన్ని స్వయంగా చైనానే వెల్లడించింది. కొవిడ్​ కేసులు, మరణాల డేటాలో చైనా పారదర్శకంగా ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా విడుదల చేసిన డేటాకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మూడేళ్లుగా సాగుతున్న జీరో కొవిడ్​ పాలసీకి గతేడాది డిసెంబర్​లో వీడ్కోలు పలికింది చైనా. నవంబర్​లో నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి చైనాలో 1.4 బిలియన్​ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది!
(1 / 6)
మూడేళ్లుగా సాగుతున్న జీరో కొవిడ్​ పాలసీకి గతేడాది డిసెంబర్​లో వీడ్కోలు పలికింది చైనా. నవంబర్​లో నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి చైనాలో 1.4 బిలియన్​ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది!(Bloomberg)
డిసెంబర్​ 8- జనవరి 12 మధ్య చైనాలో మొత్తం మీద 59,938 కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో 5,503 మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతు మరణించారు. 
(2 / 6)
డిసెంబర్​ 8- జనవరి 12 మధ్య చైనాలో మొత్తం మీద 59,938 కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో 5,503 మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతు మరణించారు. (AFP)
కాగా.. డిసెంబర్​లో కొవిడ్​ కేసులు పీక్​ దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం అవి తగ్గుముఖం పడుతున్నాయని చైనా చెబుతోంది.
(3 / 6)
కాగా.. డిసెంబర్​లో కొవిడ్​ కేసులు పీక్​ దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం అవి తగ్గుముఖం పడుతున్నాయని చైనా చెబుతోంది.(AFP)
2020లో చైనాలో కొవిడ్​ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి కేవలం 5వేల మందే మరణించారని చైనా చెబుతోంది. 
(4 / 6)
2020లో చైనాలో కొవిడ్​ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి కేవలం 5వేల మందే మరణించారని చైనా చెబుతోంది. (AP)
అంతర్జాతీయంగా వైద్య నిపుణులు మాత్రం.. చైనా కొవిడ్​ మరణాల సంఖ్య ఎప్పుడో 10లక్షలు దాటిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
(5 / 6)
అంతర్జాతీయంగా వైద్య నిపుణులు మాత్రం.. చైనా కొవిడ్​ మరణాల సంఖ్య ఎప్పుడో 10లక్షలు దాటిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.(AP)
త్వరలో చైనాలో పండుగ సీజన్​ ప్రారంభకానుంది. ప్రజలు చైనావ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్​ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
(6 / 6)
త్వరలో చైనాలో పండుగ సీజన్​ ప్రారంభకానుంది. ప్రజలు చైనావ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్​ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి