Covid In China: చైనాలో 90 కోట్ల మందికి కోవిడ్?-how many people in china may have covid about 900 million says study ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How Many People In China May Have Covid? About 900 Million, Says Study

Covid In China: చైనాలో 90 కోట్ల మందికి కోవిడ్?

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 10:05 PM IST

Covid In China: చైనాలో కొరోనా విజృంభిస్తోందన్న వార్తలు రోజుకు ఒకటి పుట్టుకొస్తోంది కానీ, అధికారికంగా చైనా నుంచి ఈ విషయంలో ఎలాంటి సమాచారమూ రావడం లేదు. అయితే, ఒక అంచనా ప్రకారం చైనాలో ఇప్పటికే 90 కోట్ల మందికి కొరోనా (corona) సోకి ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

Covid In China: పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. చైనాలో జనవరి 11 నాటికి కనీసం 90 కోట్ల మందికి కొరోనా (corona) సోకి ఉంటుంది. చైనా జనాభాలో 64% మంది ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ఉంటారు.

ట్రెండింగ్ వార్తలు

Covid In rural China: ఇక గ్రామీణ చైనాలోకి..

ఇప్పటివరకు అత్యధికంగా గాన్సు రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డారు. ఈ రాష్ట్రంలో 91% మంది కొరోనా (corona) బారిన పడ్డారని పెకింగ్ యూనివర్సిటీ వెల్లడించింది. యునాన్ రాష్ట్రంలో 84% మందికి, క్వింఘై రాష్ట్రంలో 80% మందికి కొరోనా (corona) సోకిందని తెలిపింది. ఇప్పటివరకు పట్టణ, నగర ప్రాంతాల్లోనే విస్తరించిన కొరోనా వైరస్ ఇకపై గ్రామీణ చైనాపై విరుచుకుపడనుందని చైనాకు చెందిన సీనియర్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు జెంగ్ గ్వాంగ్ హెచ్చరించాడు. చైనా చాంద్రమాన నూతన సంవత్సరం నుంచి మూడు నెలల పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా (corona) విస్తరిస్తుందని, ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని వివరించారు. చైనా చాంద్రమాన నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కోసం లక్షలాదిగా చైనీయులు తమ స్వస్థలాలైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారని, అందువల్ల అక్కడ కూడా కొరోనా (corona) వ్యాప్తి ప్రారంభమవుతుందని వివరించారు.

Covid deaths In China: మరణాలు పెరిగే అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా (corona) విస్తరిస్తే, సరైన చికిత్స లభించకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనవరి 21 నుంచి చైనా ల్యూనార్ న్యూ ఈయర్ సెలవులు ప్రారంభమవుతాయి. ఈ పండుగ జరుపుకోవడం కోసం చైనాలో కోట్లాది మంది స్వస్థలాలకు ప్రయాణమవుతారు. ఇప్పటికే చాలామంది సెలవులు పెట్టి, స్వస్థలాలకు వెళ్లారు. ఈ పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో 200 కోట్ల ప్రయాణాలు జరుగుతాయని అంచనా.

IPL_Entry_Point

టాపిక్