తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చీరకట్టులో మెరిసిన పురుషులు.. అక్కడ అదే సంప్రదాయం!

చీరకట్టులో మెరిసిన పురుషులు.. అక్కడ అదే సంప్రదాయం!

HT Telugu Desk HT Telugu

26 March 2022, 17:54 IST

    • Chamayavilakku festival | అక్కడ వేలాది మంది పురుషులు.. మహిళల దుస్తులు ధరించారు. ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కథ ఏంటంటే…
చమయవిళక్కు పండుగ వేళ పూజలు చేస్తున్న పురుషులు
చమయవిళక్కు పండుగ వేళ పూజలు చేస్తున్న పురుషులు (Facebook)

చమయవిళక్కు పండుగ వేళ పూజలు చేస్తున్న పురుషులు

Men dress up as women | కేరళ కొట్టాయంలోని కొట్టాంకులంగర శ్రీ దేవీ ఆలయంలో జరిగే చమయవిళక్కు పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. బహుశా.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఇక్కడ పురుషులు.. గడ్డాలు, మీసాలు తీసేసి.. మహిళల దుస్తులు ధరించి ప్రార్థనలు చేస్తారు!

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

సంప్రదాయ పూజలు, ప్రార్థనల మధ్య రెండురోజుల పాటు జరిగే ఈ చమయవిళక్కు వార్షిక పండుగ శుక్రవారం రాత్రి ముగిసింది. కొవిడ్​ కారణంగా 2020, 2021లో ఈ వేడుకలు రద్దయ్యాయి. రెండేళ్ల తర్వాత.. చమయవిళక్కు పండుగను అట్టహాసంగా జరుపుకున్నారు స్థానికులు.

కొవిడ్​ ముందు కనీసం 3000-4000 మంది భక్తులు ఉండేవారని.. ఇప్పుడు సంఖ్య కాస్త తగ్గిందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా.. చిన్నా పెద్దా అనే భేదం లేకుండా వందలాది మంది పురుషులు ఈ చమయవిళక్కు పండుగలో పాల్గొన్నారు. మహిళల దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంగా ఓణీలు, చీరలు ధరించి, ధగధగా మెరిసే ఆభరణాలు వేసుకుని పురుషులు.. దీపాలు వెలిగిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇందుకోసం ఆలయం ఆవరణంలో మేకప్​ ఆర్టిస్టులను కూడా ఏర్పాటు చేశారు.

ఇలా మహిళల దుస్తులు ధరించి.. ప్రార్థనలు చేస్తే.. ఉద్యోగం, ఆరోగ్యం రూపంలో తమకు సంపద లభిస్తుందని అక్కడి పురుషుల విశ్వాసం.

<p>చమయవిళక్కు పండుగలో పురుషులు..</p>

పురాణాల్లో ఏం రాసి ఉందంటే..

Chamayavilakku 2022 | స్థానికుల ప్రకారం.. కొందరి పురుషులకు ఓ కొబ్బరికాయ దొరికింది. దానిని ఓ రాయికేసి కొట్టారు. కానీ రాయి నుంచి రక్తం బయటకు వచ్చింది. అది గమనించిన వారు.. భయపడిపోయారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులకు అర్థంకాక.. జ్యోతిష్యులను సంప్రదించారు. వనదుర్గ దేవతకు ఉన్న అంతీద్రయ శక్తులు ఆ రాయిలో ఉన్నాయని, నిత్యం పూజలు చేయాలని పేర్కొన్నారు. వెంటనే ఆలయం కట్టాలని స్పష్టం చేశారు.

స్థానికులు చిన్నపాటి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ఆలయంలో దీపాలను అమ్మాయిలే వెలిగించే వారు. అందువల్ల పురుషులు కూడా మహిళల దుస్తులు వేసుకుని ఆలయంలో పూజలు చేయడం మొదలుపెట్టారు.