తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Viral Video | స్త్రీ, పురుషులు కలిసి క్రికెట్.. వీడియో పోస్ట్ చేసిన సచిన్

Viral Video | స్త్రీ, పురుషులు కలిసి క్రికెట్.. వీడియో పోస్ట్ చేసిన సచిన్

25 March 2022, 20:07 IST

    • సచిన్ అద్భుతమైన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు కలిసే వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
స్త్రీ, పురుషుల క్రికెట్
స్త్రీ, పురుషుల క్రికెట్ (twitter)

స్త్రీ, పురుషుల క్రికెట్

సచిన్ తెందూల్కర్‌ను మనదేశంలో ఇప్పటికీ అభిమానించేవాళ్లున్నారు. ఆటకు దూరమై 9 ఏళ్లు దాటినా ఆయన క్రికెట్ ప్రతిభను అంత సులభంగా మరువలేం. అడపాదడపా కౌంటీ మ్యాచ్‌ల్లో కనిపిస్తూ అభిమానులను పలకరిస్తున్నారు. క్రికెట్‌కు దూరమైన.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటున్నారు. తాజాగా ఆయన చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. స్త్రీ, పురుషులు కలిసి క్రికెట్ ఆడిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడటం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉందని పోస్టు పెట్టారు. క్రీడలు సమానత్వాన్ని పెంపొదిస్తాయని ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ వీడియోను గమనిస్తే ఓ యువతి బౌలింగ్ చేస్తుండగా.. ఓ యువకుడు బ్యాటింగ్ చేస్తుంటాడు. మొదటి రెండు బంతులను షాట్ ఆడగా.. మూడో బంతికి అతడు ఔట్ అవుతాడు. ఈ విధంగా స్త్రీ, పురుషులు కలిసి క్రికెట్ ఆడటాన్ని సచిన్ స్వాగతించారు. ఈ మ్యాచ్ ముంబయి ఎంఐజీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది.

“అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి క్రికెట్ ఆడటం చూసేందుకు చాలా బాగుంది. క్రీడలు సమానత్వానికి ఉపయోగపడతాయి" అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సచిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో గురించి విశేషంగా స్పందిస్తున్నారు. ఐపీఎల్‌లో బుమ్రా, మిథాలీ కెప్టెన్లుగా టాస్ కోసం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని ఒకరు కామెంట్ పెట్టగా.. కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ మాదిరిగా క్రికెట్‌లో ఇలాంటి మిశ్రమ స్పోర్ట్ ఈవెంట్లు నిర్వహించాలని మరోకరు స్పందించారు. క్రీడల్లో వైవిధ్యం, సమానత్వం అవసరమని మూడో వ్యక్తి తన స్పందనను తెలియజేశారు.

సచిన్ కొంత కాలం క్రితమే ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటికే 70 వేల వీక్షణలు అందుకుంది. అంతేకాకుండా 4300 మంది లైక్ చేశారు. ఇంకా ఈ నెంబర్ పెరుగుతూ ఉంది. అంతేకాకుండా నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం